మహానటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా 'మహానటి'. అశ్వినీదత్ అల్లుడు, ఎవడె సుబ్రహ్మణ్యం ఫెమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో 'నేను శైలజ', 'నేను లోకల్' ఫేం కీర్తీ సురేష్ నటిస్తుంది. అయితే కీర్తీ సురేష్ తో పాటు అక్కినేని సమంతా కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతకాలానికే కీర్తి సురేష్ కి సావిత్రి లాంటి పాత్ర దక్కడం ఆమెని లక్కీగా భావించారు అంతా. ఎందుకంటే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత ని సావిత్రి పాత్రకి ఎంపిక చెయ్యకుండా కీర్తి సురేష్ ని ఎంపిక చెయ్యడంతో కీర్తి ని అదృష్టవంతురాలుగా కొనియాడారు అంతా.
అయితే ఇప్పుడు తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే... మహానటి సినిమాలో సావిత్రి పాత్రకు ముందు సమంతనే ఎంపిక చేశామని మూవీ ప్రొడ్యూసర్ స్వప్న దత్ అంటుంది. ఈ సినిమా గురించి ఆమె ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మహానటి సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. సావిత్రి గారు పది సెకన్లలో వంద హావభావాలని పలికించగల గొప్ప నటి. ఆమె పాత్రలు ఎలా ఉండేవో ముందు మేము అర్ధం చేసుకోవాలి. సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరిని కలిసి ఆమె గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం.
సావిత్రికి సంబంధించిన చాలా ఫొటోస్ ను సేకరించాం. కేవలం సావిత్రిగారి జ్ఞాపకార్ధంగా ఓ గ్రంధాలయం ఏర్పాటు చేసుకోవాలని ఉంది. సావిత్రి గారి పాత్రకు కీర్తి సురేష్ కంటే ముందు సమంతనే సంతకం చేసింది. కానీ ఆ పాత్రలో కొత్తవారిని తీసుకుంటే బాగుంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ భావించాడు. అందుకే ఆ పాత్ర కోసం కీర్తి సురేష్ ని ఎంపిక చేశాం. సమంతా కూడా ఆ పాత్రకి ఉన్న ఇంపార్టెన్స్ ని అర్ధం చేసుకొని తన క్యారెక్టర్ ని కీర్తీ సురేష్ కి ఇచ్చింది.... అని చెప్పుకొచ్చింది స్వప్న దత్.