అక్కినేని నాగ చైతన్య ని పెళ్లి చేసుకుని అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టిన తరువాత సమంతా.... చాలా తెలివిగా సినిమాలనుఓకే చేస్తుంది. పెళ్లి తరువాత తెలుగు లో ఎటువంటి సినిమాలను ఓకే చెయ్యని సమంతా తమిళ్ లో మాత్రం వరుస సినిమాలు ఓకే చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే విశాల్ సరసన 'అభిమన్యుడు' మూవీలో నటిస్తున్న సమంతా.... తమిళ్ లో ఇంకో మూవీ ఓకే చెయ్యడమే కాదు... ఆ సినిమా టిజర్ ను కూడా రిలీజ్ చేసేసింది. అదే 'సూపర్ డీలక్స్' మూవీ.
విజయ్ సేతుపతి హీరో గా నటిస్తున్న ఈ మూవీ ని త్యాగరాజ కుమారరాజన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ టిజర్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఒకతను మత్తులో ఉండగా సమంత మాంసం కట్ చేసే ఒక పదునైన కత్తిని పట్టుకొని గొంతు పై పెట్టి కట్ చేయాలని చూస్తూ చేతులు వణకడం, మొహం మీద చమట్లు కక్కడం...అలాగే అతని మెడను సడన్ గా కట్ చేస్తుంది. అయితే సమంత ఆ వ్యక్తి మెడని కట్ చెయ్యడం చూపించకపోయినా.. ఈ టిజర్ చూసిన తరువాత ఈ మూవీ లో సమంతా నెగటివ్ రోల్ లో నటిస్తుంది అని అంటున్నారు అందరూ.
ఇక ఈ సినిమాలో రమ్య కృష్ణ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా.... ఈ మూవీ ఏప్రిల్ 27 న రిలీజ్ కి రెడీ అవుతుంది