సదాశివ గా ఇరగ్గొట్టేస్తాడట

Update: 2017-08-08 11:00 GMT

టాలీవుడ్ దర్శకుడు క్రిష్ బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన యుద్ధనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత గాధను 'మణికర్ణిక' గా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో 'మణికర్ణిక' గా లీడింగ్ రోల్ ని కంగనా రనౌత్ పోషిస్తుంది. షూటింగ్ మొదలు పెట్టి సెట్స్ మీదకెళ్ళిన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మొన్నామధ్యన 'మణికర్ణిక' షూటింగ్ లో భాగంగా కత్తి యుద్ధం సీన్స్ ని తెరకెక్కిస్తున్నప్పుడు కంగనా మొహానికి చిన్నపాటి గాయమవడంతో ఆమెని హాస్పిటల్ కి తరలించగా ఆమెకు దాదాపు 10 నుండి 15 కుట్లు పడ్డాయి. అయితే కంగనా కారణంగా కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ పడ్డ 'మణికర్ణిక' షూటింగ్ ఇప్పుడు మరలా జోరందుకుంది.

అయితే ఈ చిత్రంలో ముఖ్య పాత్ర అయిన సదాశివ అనే వారియర్ పాత్రలో బాలీవుడ్ కండల విలన్ సోనూసూద్ కనిపించబోతున్నాడు. ఈ విషయాన్నీ 'మరణికర్ణిక' చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి సోనుసూద్ ఇలాంటి చారిత్రాత్మక చిత్రమైన 'జోధా అక్బర్' చిత్రంలో నటించిన అనుభవం ఉంది. ఆ చిత్రంలో సోనూసూద్ ఒక ముఖ్య పాత్రలో నటించాడు. ఇక ఇప్పుడు 'మాణికర్ణిక'లో కూడా సోనూసూద్ సదాశివ పాత్రలో ఇరగదియ్యడానికి అప్పుడే రెడీ అవుతున్నాడు. అసలు ఒక నిజజీవిత రోల్ ని పోషించడం నిజంగా సవాల్. ఎందుకంటే ఆ పాత్రకి ఒక చరిత్ర ఉంటుంది. అలాంటి పాత్రను పోషించాలంటే కచ్చితంగా కొన్ని పరిమితులుంటాయి. క్రిష్ లాంటి టాలెంటెడ్ డైరక్టర్ తో పనిచేస్తున్నప్పుడు ఎలాంటి తప్పులు జరగవని నేను గట్టిగా నమ్ముతున్నాను. మంచి అవుట్ పుట్ ఇచ్చేందుకు నేను నా శాయశక్తులా కష్టపడతాను అంటూ సోనూసూద్ చెబుతున్నాడు.

అలాగే ఈ చిత్రంలో కీలకమైన తాంతియా తోపే పాత్రను అతుల్ కులకర్ణి పోషిస్తున్నాడు. మరి క్రిష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే 'గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి చారిత్రాత్మక సినిమాని తెరకెక్కించి హిట్ కొట్టిన క్రిష్ ఇప్పుడు ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్రను తీస్తున్నాడు. విజయేంద్రప్రసాద్ కథ అందించిన ఈ చిత్రాన్ని ఒకేసారి హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

Similar News