సంజయ్ మనసులో ఉన్నది వేరేవారట

Update: 2017-10-15 16:50 GMT

బాలీవుడ్ లో సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పద్మావతి చిత్రం గురించి ఇప్పుడు ఇండియా అంతటా తెగ చర్చించేసుకుంటున్నారు. ఆలెవల్లో పద్మావతి ట్రైలర్ అందరిని ఆకర్షించింది. సినిమా మొదలెట్టినప్పటినుండి పద్మావతి చిత్రం వివాదాల కారణంగానే పిచ్చ క్రేజ్ సంపాదించింది. అయితే ఇప్పుడు పద్మావతి ట్రైలర్ లో- దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ల పాత్రల గురించి వారు నటించిన తీరు గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. సంజయ్ తెరకెక్కించే పద్మావతి చిత్రం బాహుబలిని తన్నేశాలా కనబడుతుందని టాక్ వచ్చేసింది.

ఇండియన్ స్క్రీన్ మీద బాహుబలి అద్భుతాలు చూసిన కన్నులతో మళ్ళీ పద్మావతి సినిమా ని వీక్షించడానికి బాలీవుడ్ తోపాటు అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే పద్మావతిలో దీపికా పద్మావతిగాను, షాహిద్ కపూర్ పద్మావతి భర్తగాను... దీపికా బాయ్ ఫ్రెండ్ రణ్వీర్ సింగ్ అల్లావుద్దీన్ ఖిల్జీ అనే విలన్ పాత్రలో అదరగొట్టే పెరఫార్మెన్సు తో ఇరగదీస్తున్నాడు. అయితే పద్మావతి సినిమా అనుకున్నప్పుడు ముందుగా దీపికాని, షాహిద్ ని, రణ్వీర్ ని అనుకోకుండా వారి స్థానంలో వేరే నటీనటులను దర్శకుడు సెలెక్ట్ చేసుకున్నాడట. షాహిద్, దీపిక చేసిన పాత్రలకు సల్మాన్ ఖాన్, ఐశ్వర్యలను అనుకున్నాడట దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ.

అయితే సల్మా ఖాన్, ఐశ్వర్యాలు ప్రేమించి విభేదాలతో విడిపోయాక వారిద్దరి మధ్యన అగ్గిపుల్ల వేస్తె భగ్గుమనడం.... పెళ్లయిన తర్వాత సల్మాన్ కి జోడిగా ఐష్ నటించకూడదని ఐష్ భర్త అభిషేక్ కండిషన్ పెట్టినట్టుగా కూడా వార్తలొచ్చినా నేపథ్యంలో... పద్మావతి పాత్రకి ఐష్ ని అడిగితె సల్మాన్ ఉన్నాడుకాబట్టి చెయ్యనని... సల్మాన్ ని అడిగితె ఐష్ చేస్తే చెయ్యనని మొహమాట పడకుండా సంజయ్ కి చెప్పేశారట. మరోవైపు రణ్వీర్ చేసిన అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రకు ముందుగా షారుఖ్ ని అనుకుని షారుఖ్ ఖాన్‌ను సంప్రదించగా.. కథంతా తెలుసుకుని ఇది ఉమన్ సెంట్రిక్ మూవీ కాబట్టి తాను చేయను అనేశాడట.

ఇక చేసేది లేక సంజయ్ లీల ఇంతకుముందు బాజీరావు మస్తాన’లో చేసిన రణ్వీర్, దీపికలతో పాటు షాహిద్‌ను ఎంచుకున్నాడట. ఇక ఈ పద్మావతి చిత్రంలో అదితి రావు హైదరి చేసిన పాత్రకు ముందు ప్రియాంక చోప్రాను అనుకోగా.. ఆమె ముందు సరే అని తర్వాత డేట్లు ఇవ్వకపోవడంతో అదితిని సెలక్ట్ చేసుకున్నాడట బన్సాలీ. మరి ఈ సినిమా డిసెంబర్ లో విడుదలై హిట్ కొడితే అప్పుడు కాదన్న స్టార్స్ అంతా తెగ బాధపడిపోతారేమో చూద్దాం.

Similar News