సంక్రాంతి పండక్కి మహేష్ బాబు సినిమా

Update: 2018-01-13 08:00 GMT

సంక్రాంతి పండుగకి అనౌన్స్ చేసిన విడుదలలో ఒక్క రంగుల రాట్నం చిత్రం మినహా మిగిలిన చిత్రాలు ప్రేక్షకుల ముందుకి వచ్చి ఇప్పటికే ఫలితాలని ఖరారు చేసుకున్నాయి. ఈ పండుగకి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు తన చిత్రాన్ని పోటీకి దింపలేకపోయినప్పటికీ అధిక మొత్తానికి శాటిలైట్ హక్కులని విక్రయించిన స్పైడర్ చిత్రం ఈ ఆదివారం భోగి పండుగ (14 జనవరి 2018 ) న సాయంత్రం 4 :00 గంటలకి ప్రసారం కానుంది. విజయదశమి కి విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం చెందిన ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగకి టి.ఆర్.పి రేటింగ్స్ రూపంలోనైనా అగ్ర స్థానంలో నిలపాలని అభిమానులు సోషల్ మీడియాలో ఇప్పటికే పలు పోస్టులతో చెలరేగిపోతున్నారు.

టీఆర్పీ రేటింగ్ లోనైనా....

మహేష్ బాబు కెరీర్ లో ఉన్నతమైన చిత్రాలలో అతడు, 1 నేనొక్కడినే కచ్చితంగా ఉంటాయి. అయితే అతడు చిత్రం థియేటర్స్ లో ప్రదర్శితమైన కాలంలో ఒక వర్గ ప్రేక్షకులకి మాత్రమే పరిమితమై టెలివిజన్ ఛానెల్స్ లో ప్రసారమైనప్పుడు మాత్రం ఇప్పటికి కూడా అధిక టి.ఆర్.పి రేటింగ్స్ తో అందరి మన్ననలు పొందుతుంది. మరో వైపు 1 నేనొక్కడినే, ఖలేజా చిత్రాలు బాక్స్ ఆఫీస్ డిజాస్టర్స్ గా నిలిచినప్పటికీ బుల్లి తెరపై అవి సృష్టించిన సంచలనం తెలిసిందే. మరి స్పైడర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వసూళ్లతో మెప్పించలేకపోయినా టి.ఆర్.పి రేటింగ్స్ తో రికార్డ్స్ సృష్టిస్తుందేమో చూడాలి.

Similar News