అర్జున్ రెడ్డి తో అమాంతంగా యూత్ ఫాలోయింగ్ పెంచేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా విజయంతో విజయ్ దేవరకొండ స్టయిల్ కి కుర్రకారు ఫిదా అవుతున్నారు. అతని డ్రెస్సింగ్ స్టయిల్ దగ్గరనుండి... అన్ని విషయాల్లోనూ యువత విజయ్ దేవరకొండని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ నుండి రాబోయే సినిమాల మీద అర్జున్ రెడ్డి ప్రభావం బాగా వుంది. అందుకే విజయ్ చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్టులకు భలే గిరాకీ ఏర్పడింది. ఇప్పుడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ రాహుల్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు.
ప్రముఖ నిర్మాణ సంస్థలు గీత ఆర్ట్స్ వారు, యువి క్రియేషన్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తాడట. అలాగే సినిమా కథ మొత్తం ఆ క్యాబ్ చుట్టూనే తిరుగుతుందట. అందుకే విజయ్ దేవరకొండ సినిమాకి 'షికార్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు సమాచారం అందుతుంది. యూత్ తో పాటు మాస్ ఆడియాన్స్ ను ఆకట్టుకునేలా ఈ సినిమాను రాహుల్ రూపొందిస్తున్నాడట. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తుంది.
ప్రియాంకా జవాల్కర్ ఈ సినిమాలో డాక్టర్ పాత్రలో కనిపించనుంది. మరి విజయ్ నుండి వచ్చే సినిమాలపై ఇప్పుడు బోలెడన్ని అంచనాలున్నాయి. అలాగే ఈసినిమాతోపాటే ప్రస్తుతం విజయ్ చేతిలో మరో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి.