షాలిని.. నువ్ కేక

Update: 2017-12-02 12:00 GMT

అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండని బేబీ.. బేబీ అంటూ ముద్దు ముద్దుగా మురిపించిన షాలినీ పాండే... ఇప్పుడు తమిళ్ లోనూ బిజీ బిజీ గా మారిపోతుంది. ఇప్పటికే తెలుగు 100 పర్సెంట్ లవ్ తమిళ్ రీ మేక్ లో తమన్నాను, హెబ్బా పటేల్ ని కాదని మరీ.. చాన్స్ కొట్టేసిన షాలినీ.. ఇప్పుడు మరో క్రేజీ హీరో జీవాతో కలిసి రొమాన్స్ చేయబోతోందనే న్యూస్ కోలీవుడ్ మీడియాలో హైలెట్ అయ్యింది. క్యూట్ గా పొట్టిగా వుండే షాలిని అందంతో అభినయంతో ఆకట్టుకుంటుంది.

అయితే ఈ విషయాన్నీ షాలినీ దగ్గర కదపగా... దానికి షాలిని పాండే.... జీవాతో కలిసి నటించడంపై క్లారిటీ ఇవ్వకపోయినా.. తన కెరీర్ గురించి మాత్రం మాట్లాడింది. తనకి అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత.. తెలుగుతో పాటు...తమిళంలోనూ చాలా అవకాశాలు వస్తున్నట్టు చెప్పింది. అయితే అందులో.. మంచివి.. తన కెరీర్ కు ఉపయోగపడేవి.. కథా భలం ఉన్న సినిమాలని మాత్రమే ఎంచుకుని నటిస్తున్నట్టు తెలిపింది. కానీ దీన్ని బట్టి చూస్తుంటే మాత్రం షాలినీ పాండే.. సీనియర్ హీరోయిన్లకు ఎసరు పెట్టేలాగే ఉందని.. ఇటు టాలీవుడ్ నుంచి.. అటు కోలీవుడ్ వరకూ ఇండస్ట్రీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

తెలుగులో అర్జున్ రెడ్డితో దడదడ లాడించిన షాలిని పాండే ఆ ఒక్క సినిమాతోనే... మహానటి వంటి క్రేజీ ప్రాజెక్ట్ లో చోటు సంపాదించి ఔరా అనిపించింది. ఇక ఇప్పుడు తమిళ్ లో నటిస్తున్న మొదటి సినిమా రిలీజ్ కాకముందే.. రెండో సినిమాకూ బుక్ అవడంతోనే.. షాలినీకి ఉన్న క్రేజ్ ఎంతో దీన్ని బట్టి స్పష్టన్గా అర్థమవుతోంది.

Similar News