బాలకృష్ణ - పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పైసా వసూల్' చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావోస్తోంది. సినిమా షూటింగ్ చాలా తొందరగా కంప్లీట్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల మీద ఫోకస్ పెట్టింది. మరి పైసా వసూల్ ని దసరా కానుకగా సెప్టెంబర్ 27 అని ఎప్పుడో ఎనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. కానీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని అప్పుడే పోస్ట్ ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టిన చిత్ర యూనిట్ అది కూడా త్వరగానే కంప్లీట్ చేసేస్తుందంటున్నారు. మరి సినిమా విడుదలకు ఇంకా రెండు నెలలు టైం ఉండడంతో 'పైసా వసూల్' ని సెప్టెంబర్ 21 కె విడుదల చెయ్యొచ్చనే ఊహాగానాలకు తెరలేపారు.
మరి ఎన్టీఆర్ తాజా చిత్రం 'జై లవ కుశ' ని సెప్టెంబర్ 21 న విడుదల చేస్తామని నిర్మాత కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చాడు. మరి 'పైసా వసూల్' ని 'జై లవ కుశ'కి పోటీగా బాక్స్ ఆఫీస్ మీదకి వదలడానికి మేకర్స్ ఒప్పుకోరు. కానీ 'పైసా వసూల్' ని సెప్టెంబర్ 21 న విడుదల చేస్తామని గాసిప్స్ పుట్టిస్తే ఎన్టీఆర్ 'జై లవ కుశ' భయపడి పోస్ట్ పోన్ చేసుకోవడమో లేక ముందుగా విడుదల చేసుకోవడమో చేస్తే గనక పైసా ని ఖచ్చితంగా సెప్టెంబర్ 21 న దింపడానికి రెడీగా ఉన్నారట. ఒకవేళ సెప్టెంబర్ 21 న కుదరకపోతే సినిమా ఎలాగూ ఫినిష్ అవుతుంది కాబట్టి సెప్టెంబర్ 7 న అయినా విడుదలకు సిద్ధమే అంటుంది 'పైసా వసూల్'.
ఏది ఏమైనా సినిమాని పూరి జగన్నాధ్ ఎంత స్పీడుగా కంప్లీట్ చేసాడంటే సినిమా ఎప్పుడంటే అప్పుడు విడుదల చేసేసుకోవచ్చు అనుకునేలా కంప్లీట్ చేసి పడేసాడు. మరి కరెక్ట్ గా పబ్లిసిటీ చేసుకుంటూ పొతే సినిమాని ఏ టైం లోనైనా ప్రీపోన్ చెయ్యడానికి ఎక్కువ ఆస్కారం వుంది అంటున్నారు.