షాకింగ్ ఎన్టీఆర్ బయోపిక్ ముహూర్తం రేపే?

Update: 2017-12-27 17:00 GMT

దివంగత నటుడు ఎన్టీఆర్ జీవితకథ పై బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ రేపు మొదలు కానున్నట్లు సమాచారం. జనవరి 18న ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఓ టీజర్ ను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోందట.. అందులో భాగంగా ఈ టీజర్ కోసం షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. హైదరాబాద్ లో నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్ లో ఈ షూటింగ్ రేపు మొదలుకానుంది. ఎన్టీఆర్ వేషధారణలో బాలకృష్ణ ఈ షూటింగ్ లో పాల్గొననున్నారు.

తేజ ప్రస్తుతం వెంకటేష్ తో ఓ చిత్రం చేస్తుండగా.. బాలకృష్ణ కే.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ‘జై సింహ’ చిత్రాన్ని పూర్తిచేశాడు. తేజ – వెంకటేష్ చిత్రం పూర్తి కాగానే ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం చిత్రీకరణ మొదలుకానుంది. బాలకృష్ణ నటించిన ‘జై సింహ’ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.

Similar News