పదహారేళ్ళ వయసు అప్పటినుండి నిన్నమొన్నటి ఇంగ్లీష్ వింగ్లిష్, మామ్ సినిమాల దాకా శ్రీదేవి సినిమా వస్తుంది అంటే శ్రీదేవి అభిమానులకే కాదు మామూలు ప్రేక్షకులకు కూడా ఎంతగా ఉత్సాహం చూపించేవారో తెల్సిందే. ఇక శ్రీదేవి కూడా అనేక భాషల్లో టాప్ హీరోయిన్ గా చక్ర తిప్పుతూ చివరికి బాలీవుడ్ లో సెటిల్ అవ్వడమే కాదు బాలీవుడ్ దర్శక నిర్మాత బోని కపూర్ ని పెళ్ళాడి సెటిల్ అయింది. అయితే శ్రీదేవికి అప్పటికి ఇప్పటికి డబ్బంటే ఎక్కువ మోజు అంటుంటారు. ఏ విషయమైనా డబ్బుతో ముడిపెడుతుందని... ఎందుకంటే శ్రీదేవి యవ్వనంతో మెరిసిపోవాలని చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్స్ తోపాటు ఖరీదైనా మేకప్ వాడుతుందని అంటుంటారు. అందుకే బాహుబలిలో శివగామి పాత్రకి గాను రాజమౌళి కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ అడిగిందంటారు.
ఇక తాజాగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ని సినిమాల్లోకి దించింది. అయినా కూడా శ్రీదేవి లుక్స్ ఇంకా యవ్వనంలో ఉన్న అమ్మాయిలాగానే కనబడతాయి. అయితే శ్రీదేవికి అనేకమంది అభిమానులున్నారు. ఆమె అంటే పడిచచ్చిపోయే ఒక వీరాభిమాని అయితే శ్రీదేవి పేరు మీద ఒక రెస్టారెంట్ నడిపెయ్యడమే కాదు.. అందులోని కొన్ని వంటకాల పేర్లు శ్రీదేవి నటించిన సినిమా పేర్లు పెట్టెయ్యాలని డిసైడ్ అయ్యాడట. మరీ ఇలా చేస్తే శ్రీదేవి ఊరుకుంటుందా. తన పేరు మీద రెస్టారెంట్ పెట్టడమే కాకుండా తాను నటించిన సినిమాల పేర్లు పెడితే ఊరుకుంటుందా. అందుకే అతనికి లీగల్ నోటీసు లు పంపినా పంపుతుంది.
ఎందుకంటే గతంలో తన కెరీర్ లో మంచి హిట్స్ ఇవ్వడమే కాదు... తనకి వీరాభిమాని అయిన రామ్ గోపాల్ వర్మ తన అనుమతి లేకుండా తన పేరుని ఒక సినిమా కి టైటిల్ గా పెడితే అతనికి నిర్ధాక్షిణ్యంగా నోటీసు లు పంపేసింది. అలాంటి వర్మని వదలని శ్రీదేవి ఇప్పుడు ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తి తన పేరు మీద రెస్టారెంట్ పెట్టి డబ్బు సంపాదిస్తుంటే ఊరుకుంటుందా... అంటూ బాలీవుడ్ జనాలు సెటైర్స్ వేస్తున్నారు.