శ్రీదేవి ప్లాన్ ఏంటబ్బా..?

Update: 2017-08-11 06:06 GMT

శ్రీదేవి తన కూతురు జాన్వీ కపూర్ ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చెయ్యబోతుందంటూ ఎప్పటినుండో వార్తలొస్తున్నాయి. కానీ అది ఇంతవరకు జరగలేదుగాని... జాన్వీ కపూర్ మీద అనేక రకాల గాసిప్స్ మాత్రం ప్రచారంలోకొచ్చాయి. జాన్వీ కపూర్ సినిమాల్లోకి అడుగెట్టకముందే బాయ్ ఫ్రెండ్ ని వెంటేసుకుని తిరుగుతుందని..... అలాగే పార్టీలకు, పబ్ లకు, పర్సనల్ పార్టీలకు వెళుతున్నట్టు కూడా ప్రచారం జరగడమే కాదు మీడియాకి కూడా చాలాసార్లే చిక్కింది. ఇక శ్రీదేవి కూడా కూతుర్ని సినిమాలోకి లాంచ్ చేద్దామనే ఉంది కానీ అది ఎలాగో తెలియక తికమకపడుతున్నట్లుంది. అసలు జాన్వీ కపూర్ ని బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ చేద్దామనుకుని ఇప్పుడు సైలెంట్ అయ్యింది శ్రీదేవి.

కరణ్ తో కూతురు లాంచింగ్ ని పక్కన పెట్టిన శ్రీదేవి ఇంకా రకరకాలుగా కూతురు సినిమా ఎంట్రీ గురించి ఆలోచిస్తుందని చెబుతున్నారు. మరో పక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ అందరిలో శ్రీదేవి కూతురు జాన్వీ మీద వచ్చిన పుకార్లు ఇంకెవరి మీద రాలేదు. అయితే ఆ రూమర్లకు ఎపుడు చెక్ పెట్టకుండా శ్రీదేవి మాత్రం మౌనం వహిస్తూనే వుంది. అయితే జాన్వీ కపూర్ సినిమాల్లో మెగా బ్రేక్ కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ వెంట పడుతోందని ఒక రూమర్ వినిపిస్తోంది. మరి ఎప్పుడూ రూమర్లుకి చెక్ పెట్టని శ్రీదేవి..... మొదటిసారిగా ఈ రూమర్ పై కాస్త ఘాటుగానే స్పందించింది.

అసలీమధ్యన తన కూతురు జాన్వీ మీద వచ్చిన రూమర్స్ మరీ ఎక్కువైపోయాయని.... ఆ విషయం తన కూతుర్లకు ముందే చెప్పిందట శ్రీదేవి. స్టార్ కిడ్స్ అన్నాక ఇలాంటి రూమర్స్ సహజమని... అవేమి పట్టించుకోకుండా మన పనులు మనం చేసుకోవాలని చెప్పానని చెబుతుంది. అలాగే ఆ రూమర్స్ మనకి నచ్చిన నచ్చక పోయినా లైట్ తీసుకోవాలని చెప్పానని చెబుతుంది. ఇంకా ఎన్ని చెప్పినా కూడా ఈ మధ్యన వచ్చిన ఒక రూమర్ చూసినప్పుడు మాత్రం కొంచెం బాధనిపించిందని... ఒక పార్టీలో నా కూతురు ఝాన్వి కపూర్ హీరో రణబీర్ కపూర్ వెంట పడుతుంది అని రాశారు. అందులో ఒక్క శాతం కూడా నిజం లేదు.... అసలక్కడ జరిగింది వేరు మీడియా రాసింది వేరు. అప్పుడే మా అమ్మాయి జాన్వితో చెప్పాను ఇలాంటి అనుభవాలు ఎదురువుతూ ఉంటాయి. అది కూడా మనమంచికే అని చెప్పనంటుంది శ్రీదేవి.

Similar News