శ్రీదేవి కూతురిపై ప్రశంసలు కురిపిస్తున్న బాలీవుడ్

Update: 2017-12-19 10:00 GMT

'పులి కడుపున పులే పుడుతుంది..' అని శ్రీదేవి కూతురు జాన్వీ గురించి బాలీవుడ్ నిర్మత కరణ్ జోహార్ అన్నారు. మరాఠీ లో సెన్సేషన్ సృష్టించిన 'సైరాత్‌'ని హిందీలోకి 'ధడక్‌' పేరుతో రీమేక్‌ చేస్తుండడం ఈ సినిమాతోనే జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అవుతుంది. తన కూమార్తె అరంగేట్రానికి ఇదే కరెక్ట్ సినిమా అని భావించి ఓకె చెప్పింది శ్రీదేవి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దిశలో వుంది.

అయితే లొకేషన్ లో జాన్వీ కపూర్ ని చూస్తుంటే యంగ్ ఏజ్ లో శ్రీదేవి ఎలా ఉండేదో అలా గుర్తుకువస్తుందని నిర్మాత కరణ్ జోహార్ అన్నారు. జాన్వీ లుక్స్ గాని ఎక్స్ప్రెషన్స్ గాని కమిట్మెంట్ విషయంలో గాని విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ఖాయమన్నది దర్శకుడు శశాంక్‌ ఖైతాన్‌ మాట. తల్లి నుంచి వారసత్వంగా జాన్వీకి యాక్టింగ్‌ స్కిల్స్‌ వచ్చేసాయి అని ధడక్‌ టీం అంటున్నారు. ఇక శ్రీదేవి కూతురు కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

తన కుమార్తె తెరంగేట్రానికి సంబంధించి చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్న శ్రీదేవి తొలి సినిమాకి ముందే కూతురికి నటన డాన్స్‌ వంటి విషయాల్లో పూర్తిస్థాయిలో శిక్షణ ఇప్పించేసింది. సైరాత్‌ సినిమా మరాఠి లో చాలా మంది చూసేసారు. ఆ సినిమాపై ప్రశంసలు కూడా కురిపించారు. మరి జాన్వీ హీరోయిన్ గా వస్తున్న ధడక్‌ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Similar News