శ్రద్ద మామూలుది కాదు

Update: 2017-11-25 13:00 GMT

శక్తి కపూర్ కూతురిగా తెరంగేట్రం చేసిన శ్రద్దా కపూర్ ‘ఆషీకీ 2’ చిత్రంతో అభిమానులను , విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక్క చిత్రం విజయంతోనే పరిశ్రమను తన వైపు తిప్పుకుంది శ్రద్దా కపూర్. ఆ తరువాత తను నటించిన చిత్రాలు కూడా ఫర్వాలేదనిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా అమ్మడు బాహుబలి చిత్రంతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు ప్రభాస్. బాహుబలి తరువాత అతడు నటించే చిత్రాలన్నీ ఇక పై భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నవే.. అందులో ముఖ్యమైనది ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘సాహో’ చిత్రం.

ఈ చిత్రం తెలుగు , హిందీ , తమిళ భాషల్లో ఏకధాటిగా చిత్రికరణ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేయడానికి.. ముఖ్యంగా అక్కడ చిత్రం మార్కెట్ ను మరింత పెంచాలని చూస్తున్న ‘సాహూ’ బృందం ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ ను హీరోయిన్ గా ఎంచుకుంది. శ్రద్దా కపూర్ ను ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంచుకోవడం ద్వారా హిందీలో ఈ చిత్రానికి క్రేజ్ సంపాదించొచ్చని వాళ్ళ ఆలోచన అయ్యుండొచ్చు. కాగా.. శ్రద్దా కూడా హైదరాబాద్ లో జరిగిన ఈ చిత్రం చిత్రీకరణ షెడ్యూల్ లో ఇప్పటికే పాల్గొంది. మాములుగా ఉత్తరాది భామాలు తెలుగు చిత్రాల్లో నటించినా వారి డబ్బింగ్ ను మాత్రం వేరే వాళ్లే చెబుతారు.

కానీ ‘సాహో’ చిత్రం కోసం శ్రద్దా మాత్రం తన డబ్బింగ్ ను తానే చెప్పుకోవాలని భావిస్తోందట.. 'దర్శకుడు, నిర్మాతలు అవకాశమిస్తే నా డబ్బింగ్ చెప్పడానికి నేను సిద్ధం. మనకు రాని భాషలో డబ్బింగ్ చెప్పడం కష్టమైనా.. నా కోసం వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడం బాగోదు. అందుకే నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా..' అంటూ తెలిపింది శ్రద్దా. మరి దర్శకుడు సుజీత్, నిర్మాతలు వంశీ – ప్రమోద్ లు శ్రద్దా కు డబ్బింగ్ అవకాశం ఇస్తారా..లేదా అనేది చూద్దాం.

Similar News