శ్రద్ద పై కేసా?

Update: 2017-09-20 06:10 GMT

ప్రభాస్ హీరోగా వస్తున్న సాహో మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ద కపూర్ సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఎన్నో రోజులు వేట కొనసాగించిన చిత్ర బృందం ఫైనల్ గా బాలీవుడ్ భామ శ్రద్ద ని ఫైనల్ చేసింది. ఇక సాహో హీరోయిన్ గా శ్రద్ద సాహో లో ఫైనల్ అయినప్పటినుండి ఆమె పేరు నిత్యం వార్తలోనే ఉంటుంది. అటు బాలీవుడ్ మూవీస్ తో పాటే ఇటు తెలుగులో సాహో చేస్తున్న శ్రద్ద కపూర్ మీద చీటింగ్ కేసు నమోదైంది. ఏజే మిస్ట్రీ అండ్‌ తియా మిన్హాస్‌ అనే సంస్థ శ్రద్ద కపూర్ పై చీటింగ్ కేసు పెట్టింది.

శ్రద్ద కపూర్ మీద ఏజే మిస్ట్రీ అండ్‌ తియా మిన్హాస్ సంస్థ ఎందుకు కేసు పెట్టింది అంటే... తమతో చేసుకున్న ఒప్పందాన్ని శ్రద్ద ఉల్లంఘించడమే కారణమంటున్నారు. బాలీవుడ్ లో ‘హసీనా పార్కర్‌’ సినిమాలో శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ డ్రెస్సులను ఏజేటీఎం సంస్థ స్పాన్సర్ చేసింది. మరి ఒప్పందంలో భాగంగా సినిమాలోనూ, ప్రమోషన్లలో తమ బ్రాండ్ దుస్తులే ధరించాలని హీరోయిన్ శ్రద్ధా కపూర్, ఆ సినిమా ప్రొడ్యూసర్లతో ఆ సంస్థ డీల్ కుదుర్చుకుంది. అయితే సినిమాలో తమ కంపెనీ దుస్తులు ధరించినప్పటికీ..... ఇప్పుడు ప్రమోషన్స్ లో మాత్రం తమ కంపెనీ దుస్తులు లేకుండా నార్మల్‌గా పాల్గొంటున్నారు యూనిట్ సభ్యులు.

దీంతో ఆగ్రహించిన సదరు సంస్థ.. శ్రద్ధాకపూర్‌తో పాటు చిత్ర నిర్మాతలపైనా ముంబై కోర్టులో కేసు వేసింది. ఇక ఈ కేసు అక్టోబర్ 26 న విచారణకు రానుంది అంటున్నారు. మరి ఇప్పుడు ఈ కేసుతో శ్రద్ధ కపూర్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

Similar News