శౌర్య ఛలో అదరగొడుతుందిగా?

Update: 2017-12-05 07:00 GMT

ఈమధ్యన చిన్న సినిమాలు అలా థియేటర్ కి వస్తున్నాయి.... వెంటనే మాయమైపోతున్నాయి. ఆ సినిమాలకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా పెద్ద సినిమాలను తట్టుకుని థియేటర్స్ లో నిలబడాలంటే మాత్రం.. ఆ సినిమాలను ఏదో ఒక పెద్ద నిర్మాణ సంస్థ సమర్పించాల్సిన పరిస్థితుల్లో చిన్న సినిమాలు ఉన్నాయి. అయితే చిన్న సినిమా నిర్మాతలకు ఆయా సినిమాల బిజినెస్ ల కన్నా.. గుడ్డిలో మెల్లలా శాటిలైట్ హక్కులు మాత్రం కాస్త ఊరటనిస్తున్నాయి. పెద్ద సినిమాల శాటిలైట్ హక్కులు కోసం ఛానల్స్ ఏ రేంజ్ లో పోటీపడతాయో... చిన్న సినిమా ల శాటిలైట్ హక్కుల కోసం అలాంటి పోటీ నెలకొని ఉంది.

ఇకపోతే చిన్న సినిమాలు విడుదలై థియేటర్ లోకొచ్చే ముందే శాటిలైట్ హక్కులు అమ్ముడు పొతే మాత్రం చిన్న నిర్మాతలకు పండగే. అయితే ఇప్పుడు తాజాగా నాగ శౌర్య సినిమా ఛలోకి కూడా శాటిలైట్ హక్కుల ద్వారా మంచి ధరే పలికింది. త్రివిక్రమ్ దగ్గర పని చేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగ శౌర్య ఓన్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఛలో సినిమా ఈ నెల చివరివారంలో విడుదలకు సిద్దమవుతుంది.

ఈ సినిమాలో నాగ శౌర్య కి జోడిగా కన్నడ కిర్రక్ పార్టీ ఫెమ్ రష్మీక మడొన్న హీరోయిన్ గా అంటిస్తుంది. ఇప్పటికే విడుదలయిన ఛలో టీజర్ తో ఈ సినిమా మీద మంచి అంచనాలు వచ్చేసాయి. అయితే ఛలో సినిమా బిజినెస్ కూడా ఆంధ్రలోని చాలా ఏరియాలు లో జరుగుతున్నప్పటికీ .... ఇప్పుడు ఛలో శాటిలైట్ హక్కులను నాగ శౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ జెమిని ఛానల్ వారికి 2.52 కోట్లకి అమ్మేసారట. అంతేకాకుండా తమిళం లో కూడా ఈ సినిమాని రీమేక్ చెయ్యడానికి తమిళ నిర్మాతలు నాగ శౌర్య తండ్రితో బేరసారాలు జరుపుతున్నట్టుగా టాక్.

Similar News