శేఖర్ లాగా త్రివిక్రమ్ కూడా ట్రై చేస్తున్నాడా?

Update: 2017-09-27 16:00 GMT

త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కలయికలో వస్తున్న PSPK 25 చిత్రం ఎప్పుడో మొదలైంది. కానీ.. ఇప్పటివరకు షూటింగ్ మాత్రం పూర్తికాలేదు. మొన్నeమధ్యన కాన్సెప్ట్ పోస్టర్, సాంగ్ బిట్ అంటూ హడావిడి చేసిన చిత్ర బృందం ఈ దసరా పండక్కి పవన్ చిత్రం టైటిల్ ని విడుదల చేస్తారనుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం టైటిల్ విడుదుల కావడంలేదనే సమాచారం అందుతుంది. అయితే పవన్ కళ్యాణ్ టైటిల్ లుక్ విడుదల కాకపోతే ఏంటి ఇప్పుడో సూపర్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.

ఉదయభాను ఐటెం సాంగ్.....

అదేమిటంటే హాట్ యాంకర్ గా ఒక వెలుగు వెలిగి సైలెంట్ గా పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు తల్లి అయినా ఉదయ భాను, పవన్ - త్రివిక్రమ్ సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఉదయ భానుకి ఐటెం పాటలో డాన్స్ చెయ్యడం కొత్తేమీ కాదు. ఇంతకుముందే శేఖర్ కమ్ముల - రానా కలయికలో వచ్చిన లీడర్ సినిమాలో ఐటెం సాంగ్ లో అలరించింది. అయితే అప్పట్లో ఉదయ భానుకి పెళ్ళికాలేదు. మంచి ఫామ్ లో ఉంది. కానీ ఇప్పుడు పెళ్ళై ఇద్దరు పాపలు.... ట్విన్స్ వున్నారు. కాకపోతే ఇప్పుడు ఉదయభాను మళ్ళి బుల్లితెర మీద తన హవా కొనసాగించడాయికి తయారైంది.

ఫేక్ న్యూసేనా?

మా టీవీలో ప్రసారం కాబోతున్న ఒక డాన్స్ షోకి యాంకరింగ్ చెయ్యడానికి రెడీ అవుతున్న ఈ భానుకి ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటెం సాంగ్ అవకాశం వచ్చిందా లేదా కేవలం అందరి అటెన్షన్ ఉదయ బాను మీద పడేలా ఎవరైనా ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. మరోపక్క ఉదయ భాను కి ఉన్న క్రేజ్ ని త్రివిక్రమ్ ఉపయోగించుకోవాలనుకుంటున్నాడట. ఉదయ భాను ఈ మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలవడం... అలాగే సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులను ఆహ్వానించి తన పిల్లల బర్త్ డే ని చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసి హైలెట్ అయ్యింది. మరి ఇదంతా చూస్తుంటే ఉదయభాను మరోమారు వెండితెర, బుల్లితెరల మీద బిజీ అయ్యేలాగే కనబడుతుంది.

Similar News