శతదినోత్సవం జరుపుకోవడం ఖాయమట!!

Update: 2017-07-19 04:49 GMT

నాలుగైదేళ్లుగా ప్రభాస్‌ని ఆయన అభిమానులు ప్రేక్షకులు 'బాహుబలి' లుక్‌లోనే చూస్తున్నారు. దాంతో 'సాహో' కోసం తమ హీరో ఎలాంటి స్టైల్‌లో, ఎలాంటి ఫిజిక్‌తో కనిపిస్తాడని అందరిలో ఆసక్తి ఉంది. తాజాగా పీఆర్వో వంశీ ప్రభాస్‌ న్యూలుక్‌ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ న్యూలుక్‌కి అభిమానులు ఫిదా అవుతుండగా, మరికొందరు ప్రభాస్‌లో ఏదో తేడా ఉందంటున్నారు. మొత్తానికి ఈ లుక్‌ మాత్రం ఫ్రెష్‌గా ఆకట్టుకునేలాఉంది.

కాగా ఈ చిత్రం కోసం ప్రభాస్‌ 'బాహుబలి' కంటే చాలా సన్నబడి, బరువు తగ్గి కనిపిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ప్రభాస్‌ బరువు తగ్గాల్సిన అవసరం ఉండటంతో మొదట్లో అనుష్కను అనుకున్నప్పటికీ ఈమె లావుగా ఉండటంతో ఆమెను పక్కనపెట్టేశారు. ఇంకా హీరోయిన్‌ని ఫైనలైజ్‌ చేయలేదు. ఇక ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది. విలన్‌ నీల్‌నితిన్‌ ముఖేష్‌పై సీన్స్‌ తీస్తున్నారు. ఈ నెలాఖరులో ప్రభాస్‌ షూటింగ్‌లో జాయిన్‌ అవుతాడని తెలుస్తోంది. ఇది ప్రభాస్‌కి 19 వ చిత్రం. ఈ చిత్రం కోసం ఏకంగా 150 కోట్ల భారీ బడ్టెజ్‌ని యువి క్రియేషన్స్‌ అధినేతలు కేటాయించారు.

శంకర్‌ -ఎహసాన్‌-లాయ్‌ సంగీతం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళంతో పాటు బాలీవుడ్‌లో కూడా రూపొందనుంది. ఇక ప్రభాస్‌ 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చిత్రం విడుదలై 75రోజులైంది. ఇప్పటికీ అనేక భాషల్లో, పలు కేంద్రాలలో ఆడుతూనే ఉంది. ఈ సందర్భంగా తమకు మంచి లాభాలు తెచ్చిపెట్టిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లు సెలబ్రేషన్స్‌ చేస్తున్నారు. వంద రోజుల చిత్రాలే లేని నేటిరోజుల్లో ఈ చిత్రం చాలా సెంటర్లలో శతదినోత్సవం జరుపుకుని మరో రికార్డును నెలకొల్పడం ఖాయమంటున్నారు.

Similar News