వ్యవహారం ముదిరింది!

Update: 2017-11-03 10:00 GMT

రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా విడుదలకు ముందు.. ఆ సినిమా నిర్మాత స్రవంతి రవి కిశోర్ - బెల్లంకొండ సురేష్ కి మధ్యన ఒక చిన్న గొడవ జరిగినట్లుగా ప్రచారం జరిగింది. హీరో రామ్ కి గతంలో ఎప్పుడో బెల్లంకొండ సురేష్ తన బ్యానర్ లో నటించేందుకు కొంత డబ్బు అడ్వాన్స్ గా ఇచ్చాడట. అయితే ఈ అడ్వాన్స్ ఇచ్చి కొన్నేళ్లు గడుస్తున్నా రామ్ మాత్రం బెల్లంకొండ బ్యానర్ లో సినిమా చేయకపోవడంతో తన అడ్వాన్స్ తనకి తిరిగి ఇవ్వమని సురేష్... రామ్ చుట్టూ తిరిగినా ఉపయోగం లేకపోయేసరికి... రామ్ తాజా చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ' విడుదలకు ముందు బెల్లంకొండ సురేష్ తన డబ్బు గురించి ఆ సినిమా నిర్మాత స్రవంతి రవి కిషోర్ ని గట్టిగా నిలదీశాడట. తనకి తన డబ్బు తిరిగి ఇవ్వకపోతే.. 'ఉన్నది ఒకటే జిందగీ' మాస్టర్ కాపీ తనవద్ద ఉందని.. దానిని నెట్ లో పెట్టేస్తానని బెల్లంకొండ.... ఆ సినిమా నిర్మాత స్రవంతి రవికిశోర్ ను బెదిరించి డబ్బు వసూలు చేశాడనే న్యూస్ హల్చల్ చేసింది.

అయితే ఈ విషయంపై అటు బెల్లంకొండ గాని.. ఇటు స్రవంతి రవి కిషోర్ గాని ఎక్కడా పెదవి విప్పలేదు. ఒకరిపై ఒకరు ఎటువంటి కామెంట్స్ చేసుకోలేదు. కానీ తాజాగా బెల్లంకొండ చేసిన పనికి రవికిశోర్ దీనిపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కంప్లైంట్ చేసినట్లుగా సమాచారం. అయితే ఫిలింఛాంబర్ వాళ్ళు బెల్లంకోండని స్రవంతి రవికిశోర్ ని పిలిపించి మాట్లాడాలని డిసైడ్ అయ్యారట. అయితే బెల్లంకొండ సురేష్ కి స్రవంతి రవికిశోర్ ల మధ్య చాలా కాలం నుంచి విభేదాలు నెలకొని ఉన్నాయని.... కానీ దానిని సెటిల్ చేసుకోవడానికి బెల్లంకొండ చేసిన పద్దతి ఏమాత్రం బాగోలేదు అని.... ఈ తరహా సెటిల్మెంట్ సినిమా ఇండస్ట్రీకి ఎంతమాత్రమూ మంచిది కాదని ఫిలింఛాంబర్ సభ్యుడొకరు అంటున్నారు.

మరి స్రవంతి రవికిశోర్ మాత్రం బెల్లంకొండ తనతో చాలా దురుసుగా.... తాను తలుచుకుంటే ఎంత స్టార్ సినిమా మాస్టర్ కాపీ కావాలన్నా సంపాదించగలనని తనతో సవాల్ గా మాట్లాడాడని ఛాంబర్ లో కంప్లైంట్ చేసాడు. కానీ బెల్లంకొండ ఒక నిర్మాత అయి ఉండి మరో నిర్మాతతో అలా మట్లాడతాడా... అసలు ఒక సినిమా మాస్టర్ కాపీని అంత ఈజీగా సంపాదించేయొచ్చా అనే టాపిక్ మాత్రం ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలకు దారితీసింది.

Similar News