టాలీవుడ్ లో బ్రహ్మానందం తర్వాత అంతటి కామెడీ ఎవరన్నా చేస్తారు అంటే మనకు ముందు గుర్తొచ్చేది వెన్నెల కిషోర్ పేరు. ప్రస్తుతం బ్రహ్మి క్రేజ్ టాలీవుడ్ లో బాగా తగ్గింది. అతని స్థానంలో ఇప్పుడు కిషోర్ ని తీసుకుంటున్నారు. ఈ మధ్యన విడుదలైన సినిమాల్లో వెన్నెల కిషోర్ కామెడీ బాగా పండి అతనికి మంచి మార్కులు పడుతున్నాయి.
మోస్ట్ వాంటెడ్ కెమెడియన్ గా....
వెన్నెల కిషోర్ తెర మీద కనపడగానే తెలుగు ప్రేక్షకుల మొహం పై చిరునవ్వు వస్తది. కెరియర్ బిగినింగ్ నుండి కామెడీ పాత్రలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్శించాడు. మనవాడికి కామెడీ టైమింగ్ తో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ కమెడియన్ అయ్యాడు. కామెడీ రోల్స్ చేస్తూ బిజీగా వున్న కిషోర్ ఒక పెద్ద సినిమాలో సీరియస్ రోల్ చేయనున్నాడట. ప్రభాస్ - సుజీత్ కలయికలో వస్తున్నా సాహో సినిమా లో వెన్నెల కిషోర్ సీరియస్ రోల్ చేస్తున్నాడని టాక్.
ఇందులో మాత్రం సీరియస్ గానే....
ఈ సినిమాలో ప్రభాస్ ఓ దొంగ అతన్ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కిషోర్ కనిపించనున్నాడట. ఇందులో వెన్నెల పాత్ర కొంచం చమత్కారంగా ఉన్నపటికీ ఎక్కువ శాతం సీరియస్ గానే కనిపిస్తాడట. ఈ సినిమాలో ఇదో సర్ప్రైజ్ అని.. కిషోర్ పాత్ర చూసి థ్రిల్లవుతారని అంటున్నాయి యూనిట్ వర్గాలు. యువి క్రియేషన్స్ బేనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2018 ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.