వెంకీ విలన్ ఆ హీరో

Update: 2017-10-27 09:00 GMT

నారా రోహిత్ హీరోగా చేసిన సినిమాలు పెద్ద సూపర్ హిట్స్ కానప్పటికీ పర్వాలేదనిపించాయి. కానీ నారా రోహిత్ బాడీ లాంగ్వేజ్ చూస్తే మాత్రం అతనికి హీరో లక్షణాలు ఏ కోశానా కనబడవు. మంచి ఫిట్ నెస్ గాని...ఫిజిక్ గాని లేకుండా బొద్దుగా తనకు తగ్గ పాత్రలనే సెలెక్ట్ చేసుకుంటూ రోహిత్ తన సినిమాల్లో నటించాడు. 'సోలో, ప్రతినిధి, జ్యో అచ్యుతానంద' వంటి సినిమాలు తప్ప రోహిత్ కెరీర్ లో ఓ... అన్నంత సినిమా ఏది లేదు. మొన్నటికి మొన్న 'కథలో రాజకుమారి' సినిమా ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు వెళ్లిందో కూడా తెలియదు. ఇక ఇప్పుడు తాజాగా నారా రోహిత్ 'బాలకృష్ణడు' సినిమాలో నటిస్తున్నాడు.

అయితే ఇప్పటివరకు హీరో పాత్రల్లో కనబడిన నారా రోహిత్ మొదటిసారి ఒక సినిమాలో పూర్తి విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే న్యూస్ వినబడుతుంది. వెంకటేష్ - తేజ కలయికలో తెరకెక్కుతున్న సినిమాలో నారా రోహిత్ ని విలన్ రోల్ కి సంప్రదించారట. ఇక స్టోరీ లైన్ నచ్చి నారా రోహిత్ వెంటనే తేజ దర్శకత్వంలో విలన్ రోల్ కి అంగీకరించాడట. మరి తేజ సినిమాల్లో హీరో పాత్రకి తగ్గట్టే విలన్ రోల్ కూడా ఉంటుంది. అందుకే రోహిత్ కూడా వెంటనే విలన్ పాత్ర చెయ్యడానికి ఒప్పేసుకున్నాడనుకుంటా. ఇంతకుముందు తేజ దర్శకత్వంలో హీరో గోపీచంద్ విలన్ రోల్ లో అదరగొట్టాకే తన కెరీర్ లో హీరోగా సెటిల్ అయిన సంగతి తెలిసిందే.'

అయితే రోహిత్ 'అప్పట్లో ఒకడుండేవాడు, శమంతకమణి, కథలో రాజకుమారి' సినిమాల్లో కాస్త నెగెటివ్ పాత్రలు చేసాడు. కానీ ఇప్పుడు తేజ సినిమాలో మాత్రం వెంకటేష్ కి విలన్ గా సినిమా మొత్తం కనబడతాడట.

Similar News