వెంకీ, రానా కలిసి

Update: 2017-12-26 07:15 GMT

తెలుగు నటుడు రానా వెండితెరపై కాకుండా అప్పుడప్పుడూ బుల్లితెరపై కూడా మెరుస్తున్నాడు. ఇప్పటికే టీవీలో ఓ టాక్ షో, యూట్యూబ్ లో ఒక వెబ్ సిరీస్ సైతం చేశాడు. ఇప్పుడు తాజాగా మరోసారి ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కించే పనిలో పడ్డాడు ఈ దగ్గుబాటి హీరో.

రాజీవ్ గాంధీ హత్య కు సంబంధించిన కథాంశంతో ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించనున్నారట. ఈ విషయాన్ని ఈ వెబ్ సిరీస్ దర్శకుడు ఏఎంఆర్‌ రమేశ్‌ ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ కు ‘ఎల్టీటీఈ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అయితే రానా ఈ సిరీస్‌లో బాబాయ్ వెంకటేశ్‌ కూడా నటించనున్నాడట.

వెంకటేష్ ఐపీఎస్‌ అధికారి కార్తికేయన్‌ పాత్రలో నటించే అవకాశం ఉంది. రానా పాత్ర ఇంకా ఖరారవ్వలేదు. దక్షణాది భాషల్లో ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించే విధంగా ఆలోచిస్తున్నాము అని తెలిపాడు దర్శకుడు. మరి బాబయ్ అబ్బాయ్ లు కృష్ణ వన్డే జగద్గురుమ్ లో కలిసి కనబడినా.. ఆ సినిమాలో వెంకీ ఒక పాటలో తళుక్కున మెరిశాడు. ఇప్పటివరకు ఇద్దరు ఒకే మూవీ లో ఫుల్ గా స్క్రీన్ షేర్ చేసుకోలేదు. మరి మూవీలో స్క్రీన్ షేర్ చేసుకోకపోయినా... ఇప్పుడు వెబ్ సిరీస్ లో దుమ్ముదులపడానికి రెడీ అవుతున్నారు.

Similar News