వెంకీ తో మెగా హీరో?

Update: 2017-11-12 13:00 GMT

పటాస్, సుప్రీం, ఇప్పుడు రాజా ది గ్రేట్ సినిమా సక్సెస్ ల తరువాత దర్శకుడు అనిల్ రావిపూడి దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమా చేయబోతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో మల్టి స్టారర్ గా 'ఎఫ్ 2' (ఫన్ అండ్ ఫస్టేషన్) టైటిల్ తో తెరకెక్కే ఈ సినిమా లో హీరో గా వెంకటేష్ నటిస్తున్నట్టు ఆల్రెడీ అధికారికంగా ప్రకటించేసారు. ప్రస్తుతం ఈ సినిమా కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా ఈ మల్టీస్టారర్ సినిమాలో వెంకటేష్ ఒక హీరో కాగా మరొక హీరో వేటలో ఉన్న చిత్ర బృందానికి ఆ హీరో కూడా దొరికాదంటున్నారు.

అనిల్ డైరెక్షన్ లో సుప్రీమ్ సినిమాలో నటించిన సాయి ధరమ్ తేజ్ వెంకటేష్ తో కలిసి 'ఎఫ్ 2 ' లో నటించడానికి అంగీకరించాడని తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్ కు సాయి ధరమ్ అయితే బాగుంటాడని భావించిన అనిల్‌ రావిపూడి అతన్ని కలవడం.... స్టోరీ వినిపించడం అన్ని జరిగిపోయాయి అనే టాక్ నడుస్తుంది.ఇక అనిల్ రావిపూడి చెప్పిన ఈ స్టోరీ లైన్ కూడా నచ్చడం తో వెంటనే ఈ సినిమా కి ఓకే చెప్పాడట సాయి ధరం తేజ్.

అయితే ఈ సినిమాలో తాన నటిస్తున్నది వెంకటేష్ పక్కనే అని తెలియాగానే సాయి ధరం తేజ్ కి... ఇదంతా ఒక కలలాగా ఉందంట. మొత్తానికి అటు మెగా ఫ్యామిలీ ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరో లు వచ్చి మల్టీ స్టారర్ చేస్తున్నారు.

Similar News