శనివారం విడుదల ఐన వరుణ్ తేజ్ తొలి ప్రేమ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే క్లాసికల్ హిట్ అయినా సినిమా తొలి ప్రేమ. ఆ సినిమా టైటిల్ పెట్టి వరుణ్ తేజ్ చాలానే విమర్శలు ఎదురుకున్నాడు. ఐన కానీ సినిమా మీద కాన్ఫిడెన్సు తో వరుణ్ తేజ్ తన సినిమా టైటిల్ కూడా తొలి ప్రేమ పెట్టుకుని సక్సెస్ అయ్యాడు.
అయితే ఆ ‘తొలి ప్రేమ’ స్థాయిలో లేకపోయినా.. ఈ ‘తొలి ప్రేమ’ ఈ తరం ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకునేలా తెరకెక్కింది. ఈ సినిమాలో వరుణ్ కొత్తగానే కాకుండా యాక్టింగ్ కూడా బాగానే చేసి ప్రేక్షక హృదయాలు గెలుచుకున్నాడు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని తెరకేకించినా డైరెక్టర్ వెంకీ అట్లూరి గురించి మాట్లాడుకోవాలి. తొలి సినిమానే ఐన ఏ మాత్రం తడపడకుండా చక్కని స్క్రీన్ ప్లేతో సినిమాను రన్ చేసాడు.
సినిమాలో వచ్చే ప్రతి డైలాగ్ కూడా చాలా నేచురల్ గా ఉండటం..స్టోరీకి కూడా సింక్ అవ్వడంతో సినిమాకు ప్లస్ అయింది. ఇలా సినిమాలో డైలాగ్ మెరుపులు చాలానే ఉన్నాయి. దర్శకుడిగానే కాక రచయితగా వెంకీ తనదైన ముద్రే వేశాడు తొలి సినిమాతో.