గురు సినిమా విజయంతో భారీ గ్యాప్ తీసుకున్న వెంకటేష్ ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు తేజ తో ఆట నాదే వేట నాదే అంటూ కొత్త సినిమాని సైలెంట్ గా మొదలెట్టేసాడు. వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 13 న ఈ సినిమా మొదలవుతుంది అనుకుంటే.. మొన్ననే ఈ సినిమా ని తేజ - వెంకీలు మొదలు పెట్టి సెట్స్ మీదకి తీసుకెళ్ళిపోయి అందరికి షాక్ ఇచ్చారు. ఇప్పటికే సెట్స్ మీదున్న ఈ సినిమాలో ఇప్పటివరకు వెంకటేష్ పక్కన హీరోయిన్ సెట్ అవలేదు.
మొన్నటివరకు కాజల్ అగర్వాల్, వెంకటేష్ తో జోడి కడుతుంది అనుకుంటే... కాజల్, వెంకీ కి హ్యాండ్ ఇచ్చిందని..సీనియర్ హీరోతో నటిస్తే కెరీర్ లో ప్రోబ్లెంస్ వస్తాయని భయపడి కాజల్ వెనక్కి తగ్గడంతో... ఆ లిస్ట్ లోకి తమన్నా వచ్చి చేరింది. ఇక తమన్నా కూడా వెంకటేష్ పక్కన నటించేందుకు సిద్దముగా లేకపోవడంతో ఇప్పుడు తాజాగా వెంకీ కి జోడిగా అనుష్క పేరు వినబడుతుంది. వెంకటేష్ పక్కన అనుష్క అయితే బావుంటుందని చిత్ర బృందం ఆలోచించడమే తరువాయి అనుష్క తో సంప్రదింపులు కూడా మొదలెట్టేశారట.
ఇకపోతే అనుష్క కూడా భాగమతి సినిమా తర్వాత తన బరువు కారణంగా మరే సినిమా ఒప్పుకోకుండా ఖాళీగా ఉంటుంది. ఇప్పటికే అనుష్క బరువు తగ్గే పనిలో ఉండగా. ఇప్పుడు వెంకటేష్ సరసన జోడి కట్టడానికి అనుష్క కి ఇంకా అభ్యంతరాలేమి ఉంటాయంటున్నారు. ఇప్పటికే అనుష్కతో వెంకటేష్ చింతకాయల రవి వంటి సినిమాలో నటించి ఉన్నాడు. ఇక ఇప్పుడు ఆటా నాదే వేటా నాదే లో వీరిద్దరూ జోడి కడితే చూడాలనుకుంటున్నారు వెంకీ అభిమానులు. చూద్దాం ఫైనల్ గా వెంకీకి ఏ హీరోయిన్ సెట్ అవుతుందో?