టాలీవుడ్ లో బడా నిర్మాతలంటే వేళ్ళమీద లెక్కించేమంది కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వాళ్లలో బడా సినిమాలు నిర్మిస్తాడు... అదే టైం లో చిన్న సినిమాలు నిర్మిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూనే సినిమాల మీద తనకున్న ఫ్యాషన్ ని చాటుకుంటాడు నిర్మాత దిల్ రాజు. దిల్ రాజు కొత్త డైరెక్టర్స్ కి మాత్రమే కాదు, కొత్త నటీనటులకు కూడా చేయూతనిస్తాడు. దిల్ రాజు నిర్మాతగా సినిమా వస్తుంది అంటే అది సూపర్ హిట్ కిందే లెక్క. ఎక్కడో ఒకటో రెండో మాత్రమే ఆయన అంచనాలు తప్పుతాయి కానీ ఎక్కువ సినిమాలు మాత్రం హిట్స్. అందులోను ఈ మధ్యన వరుసబెట్టి సక్సెస్ సినిమాలు చేస్తున్న దిల్ రాజు, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఆయన నిర్మాణంలో తెరకెక్కిన ఫిదా చిత్రం సూపర్ హిట్టయ్యింది.
ఈ చిత్రం అంతా తెలంగాణ నేటివిటీకి దగ్గరగా తెరకెక్కడంతో ఈ చిత్రాన్ని చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ లు దిల్ రాజుని, శేఖర్ కమ్ములను తెగ అభినందించేసారు కూడా. ఈ సినిమాని చూసిన తర్వాత తెలంగాణ అంటే దిల్ రాజుకున్న ప్రేమకు కేసీఆర్ ఫిదా అయ్యి దిల్ రాజుకు ఒక ఊహించని ఆఫర్ ను ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. మరి టీఆర్ఎస్ వర్గాల చెబుతున్న దాని ప్రకారం దిల్ రాజును రాజకీయాల్లోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. అయితే దిల్ రాజు కూడా కేసీఆర్ ఆహ్వానానికి పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లుగా సమాచారం అందుతుంది.
మరి ఈ లెక్కన కేసీఆర్, దిల్ రాజుకు ఎమ్యెల్యే టిక్కెట్ ఇస్తారా? ఎంపీ టికెట్ ఇస్తారా? అనేదానికి నిజానిమాబాద్ జిల్లాకు చెందిన దిల్ రాజుకు కెసిఆర్ నిజామాబాద్ లేదా జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది. మరి సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పడమనేది కొత్తేమి కాదు. ఇక తాజాగా మరో డైరెక్టర్ వి వి వినాయక్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. సో 2019 ఎన్నికల్లో మనం కొంతమంది కొత్త సీలెబ్రిటీస్ ని ఎన్నికల్లో చూడబోతున్నామనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం చెప్పగలం.