ఎన్టీఆర్ బయోపిక్స్ అన్నిటిలో ముందుగా కేతిరెడ్డి తెరకెక్కించే లక్ష్మీస్ వీరగ్రంథం సినిమానే పట్టాలెక్కేసింది. ఎన్టీఆర్ బయో పిక్స్ గా తెరకెక్కుతున్న సినిమాల్లో తేజ, రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజి లోనే ఉన్నాయి. అన్నిటికన్నా ముందే జయం మూవీస్ పతాకంపై కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వంలో లక్ష్మీస్ వీరగ్రంథం సినిమా పూజ కార్యకమాలతో మొదలైపోయింది. సిరిపురపు విజయభాస్కర్ సమర్పణలో జి.విజయకుమార్ గౌడ్ ఈ సినిమా ని నిర్మిస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్న చిత్ర బృందం ప్రస్తుతం నటీనటుల కోసం వెతుకుతుంది.
పూజా కుమార్ ఓకే....
ఇకపోతే ఈ సినిమాలో ముఖ్య పాత్ర అయిన లక్ష్మి పార్వతి కోసం ముందు హాట్ హీరోయిన్ అయిన లక్ష్మి రాయ్ ని అనుకున్నారట. లక్ష్మి పార్వతి పాత్రకి లక్మి రాయి దాపు ఫైనల్ అనుకున్నారు కూడా. కాని ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడం తో ఇప్పుడు ఆ రోల్ కోసం గరుడవేగా హీరోయిన్ పూజా కుమార్ ని సంప్రదించారట ప్రొడ్యూసర్స్. అయితే తన రోల్ నచ్చిన పూజా కుమార్ వెంటనే ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. మరి లక్ష్మి పార్వతిగా పూజ కుమార్ ఎలా నటించబోతుందో అంటూ అపుడే అందరూ చర్చించేసుకుంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ గా స్టార్ట్ అయిన మొదటి సినిమా లో లక్ష్మి పార్వతి గా పూజా కుమార్ సెలెక్ట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ ని ఎవరు పోషిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.