విలనిజాన్ని పరిచయం చేసావ్ పో...!!

Update: 2017-07-07 03:38 GMT

బాబీ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న 'జై లవ కుశ' లో ఎన్టీఆర్ ఇపుడు తన విలనిజం ఎలా వుండబోతుందో చూపెట్టేస్తున్నాడు. చెప్పిన టైంకే అంటే గురువారం సాయంత్రం 5.22 ని.షాలకు 'జై' టీజర్ ని విడుదల చేసింది 'జై లవ కుశ' చిత్ర యూనిట్. మరి ముందునుండి చెబుతున్నట్టే 'జై లవ కుశ' మూడు టీజర్స్ తో అభిమానులకు త్రిబుల్ బొనాంజా అందించడానికి వస్తామని చెప్పినట్లే ఇప్పుడు 'జై' టీజర్ తో అభిమానులను అలరించడానికి వచ్చేసాడు.

బాబీ డైరెక్షన్ లో 'జై లవ కుశ' మొదలైనప్పటినుండి 'జై లవ కుశ' లో ఎన్టీఆర్ 'జై' పాత్రలో పూర్తి నెగెటివ్ షేడ్స్ లోనే కనబడుతాడని ప్రచారం జరుగుతుంది అయితే ఆ ప్రచారం నిజమే అని ఇప్పుడు ఈ' జై' టీజర్ చూస్తుంటే స్పష్టంగా అర్ధమవుతుంది. సుర... సుర... సుర... అంటూ కారులోనుండి కాలు బయటికి పెట్టి తన ఇష్ట దైవం రావణాసురుడికి దణ్ణం పెడుతూ నడిచొచ్చే 'జై' పాత్రలో ఎన్టీఆర్ సూపర్ పెరఫార్మెన్సుతో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఎన్టీఆర్ 'ఆ రావణుడ్ని సంపాలంటే సముద్రం దాటాలా.. ఈ రావణుడ్ని సంపాలంటే.. సముద్రమంత ధ. ధ ధ ధ ధైర్యం ఉండాలా' అంటూ ఎన్టీఆర్ నత్తితో చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది.

అయితే ఎన్టీఆర్ ని ముందు అనుకున్నట్టుగానే డైరెక్టర్ బాబీ మాస్ లుక్ తోనే 'జై' టీజర్ లో పరిచయం చేసాడు. విలన్ కుండాల్సిన అన్ని లక్షణాలు ఎన్టీఆర్ లో కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. మరి 'జై' పాత్రతో అదరగొట్టిన ఎన్టీఆర్ మిగతా కేరెక్టర్స్ ఎలా వుండబోతూన్నాయో అనే క్యూరియాసిటీని అందరిలో పెంచేసాడు. ఇకపోతే 'జై లవ కుశ' బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అనే చెప్పాలి. మరి 'జై' టీజర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వచ్చే లవ, కుశ టీజర్స్ పై మరింత ఆసక్తి అంచనాలు ఏర్పడిపోయాయంటున్నారు అభిమానులు.

Similar News