విరాట్, అనుష్కల పెళ్లి ఫిక్స్

Update: 2017-12-07 07:00 GMT

ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మ్యారేజ్ విరాట్, అనుష్క శర్మలది. దాదాపు నాలుగైదేళ్ల నుంచి ప్రేమాయణం సాగిస్తున్న వీరిద్దరూ..... అనుష్క తన గ్లామర్ లైఫ్ లో, విరాట్ తన క్రికెట్ లైఫ్ లో బిజీ గా వున్నారు. ఇద్దరు కలిసి తరుచుగా కలుసుకుంటూనే వున్నారు. ఇద్దరు కలిసి టీవీ యాడ్స్ కూడా చేసారు.

పెళ్లి మేటర్ వచ్చే సరికి ఇద్దరు మాకు ఏమి తెలీదు అన్నట్టుగానే ఉండేవారు. వీరిద్దరి ఫాన్స్ కూడా వీళ్ల పెళ్లి ఎపుడెపుడా అని ఎదురు చూసి విసిగెత్తిపోయారు. అయితే తాజాగా వీళ్ళిద్దరూ ఒక ఇంటివారవనున్నారని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఈసారి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి.

ఈనెల 9, 10, 11, 12 తేదీల్లో ఏదో ఒక మంచిరోజు చూసి ఇద్దరూ రింగులు మార్చుకోబోతున్నారట. ఇటలీలోని మిలన్ లో ప్రత్యేకంగా వీరి పెళ్లి కోసం ఏర్పాట్లు చేశారట వీళ్లిద్దరి కుటుంబ సభ్యులు. క్రికెట్, సినిమా ఫీల్డ్ సెలెబ్రెటీస్ ని ఒకే వేదికపై చూసే అవకాశం ఇంకా ఎన్నో రోజుల్లో లేదు అంటున్నారు.మరి అటువంటి వేడుక ఏ రేంజ్ లో ఉంటుందో మన ఊహకందదు. అందుకే మనం కూడా విరుష్క ల పెళ్లి కోసం వెయిట్ చెయ్యాల్సిందే.

Similar News