విజయ్ సిక్స్ ప్యాక్ మహానటి కోసమా?

Update: 2017-11-09 15:00 GMT

'అర్జున్ రెడ్డి’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగి స్టార్ హీరో గా మారిపోయిన సంగతి తెలిసిందే. అయితే మనవాడు మళ్లీ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాడు. తాజాగా విజయ్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. 'నా శరీరంతో ప్రయోగం చేస్తున్నానని, ఈ ప్రయోగం ద్వారా ఏం జరుగుతుందో చూద్దామని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసాడు'. తన ట్రైనర్ కులదీప్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోని పోస్ట్ చేశాడు. ఇదే విషయాన్ని ట్రైనర్ కులదీప్ ప్రస్తావిస్తూ ఓ పోస్ట్ చేశాడు. విజయ్ మరో ఛాలెంజ్‌కు అంగీకరించాడు.

అర్జున్‌రెడ్డి సిక్స్ ప్యాక్‌గా మారేందుకు, 360 డిగ్రీస్ ఫిట్‌నెస్‌కు అంగీకరించాడని తెలిపాడు. అయితే విజయ్.. తాను చేస్తున్న ప్రాజెక్ట్‌ గురించి ముందుగానే చిన్న హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో మూడు ప్రాజెక్టు (మహానటి, సిక్కార్, ఏ మంత్రం వేశావే)లు ఉన్నాయి..

అయితే విజయ్ సిక్స్ ప్యాక్‌.. నాగ్ అశ్విన్ తెరకెక్కించే మహానటి సావిత్రి సినిమాలో అలనాటి దేవదాసు పాత్రలో మోడ్రన్ దేవదాసు నటించబోతున్నాడని... అందుకే ఈ సిక్స్ ప్యాక్‌ అని ఫిలింనగర్ సర్కిల్ లో వినికిడి. అయితే విజయ్...సిక్స్ ప్యాక్ చేస్తున్నది మహానటి చిత్రం కోసమా? లేక వేరే చిత్రం కోసమా అన్న సంగతి తెలియాల్సి ఉంది.

Similar News