తమ సినిమాను ప్రమోట్ చేసుకువొవాలంటే.. హీరోలే స్వయంగా రంగంలోకి దిగి వారి సినిమాలని ప్రమోట్ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో సినిమాకి ప్రొమోషన్స్ చాలా కీలకంగా మారింది. కానీ ఇప్పుడు వున్నా హీరోస్ వారి సినిమాను కనీసం ప్రమోట్ కూడా చేసుకోవటం లేదు.
అందులో మొదట చెప్పుకోవాల్సిన పేరు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులతో లైం లైట్ లోకి వచ్చి అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ అయ్యిపోయాడు. అర్జున్ రెడ్డితో తన ఫేట్ పూర్తిగా మార్చేసుకున్నాడు. అంతకు ముందు తను నటించిన సినిమాలలో ఒకటైన ఏ మంత్రం వేసావే కొన్ని ఇబ్బందులు కారణంగా సెట్స్ మీదకు రాలేదు. మల్లి ఇప్పుడు విజయ్ కు మంచి పేరు వచ్చింది కాబట్టి మళ్ళీ రిలీజ్ కు సిద్ధం చేశారు. సినిమాలో తానే హీరోగా నటించిన కనీసం ఆ సినిమా పోస్టర్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిన పాపాన పోలేదు విజయ్.
సినిమా గురించి ఏమైనా అడిగితే నో కామెంట్స్ అని దాటేస్తున్న ఈ హీరో పై ప్రొడ్యూసర్స్ విరుచుకుపడుతున్నారు. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికైనా విజయ్ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటాడు అని ప్రొడ్యూసర్స్ ఆశగా చూస్తున్నారు. కానీ అటువంటి పరిస్థితులు కనపడట్లేదు. ఈ హీరోలాగే ఇంకా చాలా మంది వున్నారు. కనీసం బాధ్యత లేకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు అంటున్నారు సినీ పండితులు.