వావ్ ప్రత్యేకంగా విష్ చేశాడా?

Update: 2017-11-23 14:00 GMT

తెలుగు లో హీరోయిన్ గా నిలదొక్కుకోలేక తమిళ్ కి వెళ్ళి సెటిల్ అయ్యింది లక్ష్మి రాయ్. అయితే అక్కడ తమిళ్ లో కూడా ఈ అమ్మడుకి చేదు అనుభవం ఎదురైంది. ఇక హీరోయిన్ గా తనకి అవకాశాలు రావని గట్టిగా ఫిక్స్ అయిన లక్ష్మి రాయ్ సౌత్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తూ హాట్ ఐటెం గర్ల్ గా మంచి పేరు తెచ్చుకుంది. అలాగే మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150 ' లో కూడా చిరుతో కలిసి రత్తాలు రత్తాలు అంటూ రెచ్చిపోయి స్టెప్పులు వెయ్యడమే కాదు...అందాల ఆరబోతలో కూడా అదరగొట్టింది.

అయితే లక్ష్మి రాయ్ ఈ సారి తన లక్ ని బాలీవుడ్ లో పరీక్షించుకుందాం అని చెప్పి అక్కడ 'జూలీ 2 ' అనే సినిమాలో బోల్డ్ గా నటించింది. ఈ సినిమా మొత్తం పూర్తి స్థాయి లేడీ ఓరియెంటెడ్ మూవీ గా తెరకెక్కింది. ఈ మూవీ లో లక్ష్మి రాయ్ మునుపెన్నడూ లేని విధంగా చాలా హాట్ గా కనిపిస్తుంది. లక్ష్మి రాయ్ అందాల ప్రదర్శన చేసిన ఈ సినిమా నవంబర్ 24 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. అయితే ఖైదీ నెంబర్ 150 లో తనతో కలిసి ఇరగదీసిన లక్ష్మి రాయ్ కి 'జూలీ 2 ' తో బాలీవుడ్ హిట్ అందుకోవాలని మెగా స్టార్ చిరంజీవి విష్ చేసాడు.

ఒక వీడియో రూపంలో చిరు తన విషెస్ ని తెలియజెయ్యడమే కాదు.. లవ్ యు జూలీ అనేశాడు కూడా. చిరు లక్ష్మి రాయ్ ని ఉద్దేశించి..... బాలీవుడ్‌లో నీ మొదటి సినిమా విడుదలకానున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ 'జూలీ 2 ' నీకు చాలా ప్రత్యేకమైన సినిమా అని తెలుసు. నీ సినిమా కెరియర్‌లో ఇది 50 వ చిత్రం. అలాగే... నువ్వు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నాను. జూలీ 2 విడుదల సందర్భంగా మరొక్కసారి నీకు శుభాకాంక్షలు... అంటూనే లవ్ యు జూలీ అన్నాడు.

మరి స్వయానా మెగా స్టార్ ఇలా విష్ చేయడం తో ఇప్పుడు లక్ష్మి రాయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఓ మై గాడ్... చిరు సర్ నిజంగా మీ దీవెనలు నా హృదయాన్ని హత్తుకున్నాయి. ఇది నా జీవితంలోనే గొప్ప బహుమతిగా భావిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదములు చిరంజీవి గారూ.. ఆంటూనే మీరిచ్చిన ఈ ఉత్సాహంతో మీ రత్తాలు సర్‌ప్రైజ్ అయింది. లవ్ యు..సార్.. అంటూ లక్ష్మి రాయ్ రి ట్వీట్ చేసింది.

Similar News