వావ్ అదరగొడుతున్నాడు

Update: 2017-10-03 11:47 GMT

దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో బాలీవుడ్ టాప్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ పద్మావతి అనే చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో పద్మావతి భర్తగా షాహిద్ కపూర్ నటిస్తుండగా... దీపికా రియల్ లైఫ్ లవర్ రణ్వీర్ సింగ్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక సంజయ్‌లీలా భన్సాలీ తీసే ఇలాంటి చిత్రాలు చరిత్రను తప్పుదోవ పట్టించే విధంగా ఉంటాయని, వీరనారి అయిన పద్మావతి శత్రుదేశపు రాజైన అల్లావుద్దీన్‌ ఖిల్జీ ప్రేమలో పడినట్లు సినిమాలో చూపిస్తున్నారని తెలిసి కొంతకాలం కిందట కర్ణిసేనకి చెందిన పలువురు కార్యకర్తలు షూటింగ్‌ స్పాట్‌కి వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిగి, షూటింగ్‌ సెట్స్‌ని నాశనం చేశారు.

అయితే ఈ పద్మావతి చిత్ర కథ ఉన్నది ఉన్నట్లుగాన తీస్తున్నానని.... ఎలాంటి వక్రీకరణకు చోటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సంజయ్ లీలా భన్సాలీ ప్రకటించాడు. ఇక ఈచిత్రంలో ఇప్పటివరకు వదిలిన లుక్స్ లో టైటిల్‌ వేషధారిణి పద్మావతి లుక్‌లో దీపికా పదుకొనె, మహారాజా రావల్‌ రతన్‌సింగ్‌ పాత్రధారి షాహిద్‌ కపూర్ ఫస్ట్‌లుక్స్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఫస్ట్‌లుక్‌ కూడా విడుదలైంది. ఈ సుల్తాన్‌ లుక్‌ని చూసిన వారంతా ఫిదా అయిపోతున్నారు. ఈ పాత్రను పోషిస్తున్న రణవీర్‌ సింగ్‌ భయానక డెడ్లీ లుక్‌తో అదరగొట్టాడు.

ఆ లుక్ లో పొడవైన శిరోజాలు, భీకరమైన కంటిచూపు, మొహంపై కత్తిగాటుతో అల్లావుద్దీన్ ఖిల్జీ ఫస్ట్‌లుక్‌కి విశేష ఆదరణ లభిస్తోంది. మరి ఈ పాత్రపైనా యుద్ధంప్రకటించిన కర్ణాసేన్ కార్యకర్తలు అల్లావుద్దీన్ ఖిల్జీ లుక్ విడుదలై ఇంత టైం గడుస్తున్నా ఎటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా సైలెంట్ అయ్యింది. ఇక డిసెంబర్ లో విడుదల కానున్న ఈచిత్రంపై బాలీవుడ్‌లో భారీగా అంచనాలున్నాయి. అయితే ఈచిత్రాన్ని తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో కూడా అనువాదం చేసి బాహుబలిని టార్కెట్‌ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.

Similar News