వాళ్ళ తర్వాత కాస్ట్లీ డైరెక్టర్ ఈయనేనా..?

Update: 2017-07-14 08:00 GMT

టాలీవుడ్ లో ఇప్పటివరకు ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ హిట్టే.మరి అలాంటి డైరెక్టర్ కి రెమ్యునరేషన్ ఎంత ఇవ్వడానికైనా బడా నిర్మాతలు ఎప్పుడు రెడీగానే ఉంటారు. అలాగే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న ఎస్ ఎస్ రాజమౌళి అందరికన్నా ఎక్కువ పారితోషకం తీసుకుంటూ టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ కి ఫుల్ క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు కూడా దాదాపు మంచి హిట్ అయినవి ఉన్నాయి. రాజమౌళి తర్వాత నెంబర్ లో త్రివిక్రమ్ పారితోషకం ఉందంటున్నారు. అత్యధిక పారితోషకం తీసుకుంటున్న వీరి తర్వాత ఇప్పుడు మరో డైరెక్టర్ టాప్ త్రీ ప్లేస్ కి చేరుకున్నాడు.

ఆ డైరెక్టర్ ఎవరనేది మీకు ఇప్పటికే అర్ధమై ఉంటుంది. టాలీవుడ్లో మిర్చి తో హిట్ కొట్టి, శ్రీమంతుడుతో సూపర్ హిట్ కొట్టి, జనతా గ్యారేజ్ తో బంపర్ హిట్ కొట్టడంతో కొరటాల ఒక్కసారిగా టాప్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక ఇప్పుడు మళ్ళీ మహేష్ తో భరత్ అను నేను చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పుడు మహేష్ సినిమా తర్వాత కొరటాల చెయ్యబోయే రామ్ చరణ్ సినిమా కోసం కొరటాల అధిక మొత్తంలో పారితోషకం అందుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి.

కొరటాల - చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కోసం 14 కోట్ల పారితోషకం అందుకుంటున్నాడట. మరి ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ కి ఇచ్చిన హిట్స్ తో కొరటాల తన రెమ్యునరేషన్ అమాంతంగా పెంచేసినట్లు చెబుతున్నారు. అయితే చరణ్ చిత్రానికి కొరటాలా కథ అందించడంతో ఇంత పెద్ద మొత్తంలో పారితోషకం ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడలేదనే వార్తలున్నాయి. మొత్తానికి అతి తక్కువ కాలంలోనే కొరటాల ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడన్నమాట.

Similar News