సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు కరువైపోయి... స్పెషల్ సాంగ్స్ లో నాట్యమాడే లక్ష్మి రాయ్... బాలీవుడ్లో హీరోయిన్ గా చేసిన జూలీ 2 ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ సినిమాతో బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిపోదామని కలలుకంది. అందుకే లక్ష్మి రాయ్ కెరీర్ లో ఎన్నడూ లేనంతగా అందాలు ఆరబోసింది. అయినా ప్రయోజనం లేకుండా లేకపోయింది. జూలీ 2 సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. జూలీ 2 ఏ రేంజ్ ఫ్లాప్ అంటే… 2017 బిగ్గెస్ట్ డిజాస్టర్లలో జూలీ 2 కూడా ఒక్కటిగా మిగిలిపోయింది.
జూలీ 2 విడుదలైన ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమాకు కేవలం 2 కోట్ల 50లక్షల రూపాయల వసూళ్లు మాత్రమే వచ్చాయి. అసలు ఒక బాలీవుడ్ సినిమాకు వారం రోజుల్లో 2 కోట్ల 50లక్షల వసూళ్లు అంటే అంతకంటే హీనం మరొకటి ఉండదు. జూలీ 2 విడుదలైన మొదటి షోకే సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో.. ఇక రెండో ఆట నుంచి జనాలు థియేటర్లవైపుకు రావడం మానేశారు. దెబ్బకి బాక్సాఫీసు వద్ద జూలీ 2 సినిమా బావురుమంది. ఇటు తమిళ వెర్షన్ ది కూడా అదే పరిస్థితి.
లక్ష్మి రాయ్ కి మంచి ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ లో కూడా జూలీ 2 ఫ్లాప్ అయిందంటే.. సినిమాలో కంటెంట్ ఏంత పూర్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. లక్ష్మి రాయ్ అందాల్ని వెండితెరపై నిండుగా చూడొచ్చని తమిళ ప్రేక్షకుడు కూడా ఊహించాడు. కానీ వాళ్లు ఊహించింది ఒకటి సినిమాలో ఉన్నది ఇంకోటి. జూలీ 2 ట్రయిలర్ లో చూపించినవి మినహా సినిమాలో కొత్తగా ఏం లేకపోవడంతో కోలీవుడ్ లో కూడా జూలీ 2 అట్టర్ ఫ్లాప్ అయింది. దెబ్బకు లక్ష్మి రాయ్ బాలీవుడ్ ఆశలు గల్లంతైపోయాయి