వాటే సెల్ఫీ!

Update: 2017-12-30 11:38 GMT

ప్రముఖ బంగారు దుకాణం కళ్యాణ్ జ్యువెల్లర్స్‌ కి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని నాగార్జున బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అసలు ఆ షాప్ నాగార్జునే నిర్వహిస్తున్నాడా అన్నట్టుగా ఉంటాయి ఆ కంపెనీ యాడ్స్. అయితే ఇక్కడ తెలుగులో నాగార్జున బ్రాండ్ అంబాసిడర్ అయితే... తమిళంలో, బాలీవుడ్ లో వేరే హీరోలు బ్రాండ్ అంబాసిడర్లు గా ఉన్నారు. అయితే ఈ జ్యువెల్లర్స్‌ సంస్థ కు సౌత్ నుండి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న నాగార్జున అక్కినేని, శివరాజ్‌కుమార్‌, ప్రభు, మంజువారియర్‌ లు నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవానికి గాను మస్కట్‌ వెళ్లారు.

అందులో భాగంగానే... బాలీవుడ్‌ బాద్‌ షా షారూఖ్‌ ఖాన్‌తో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోలందరూ కలిసి దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కళ్యాణ్ జ్యువెల్లర్స్‌ సంస్థ మస్కట్‌లో తన కొత్త బ్రాంచ్ ను ప్రారంభించింది. అయితే నార్త్ నుండి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న అమితాబచ్చన్ అనారోగ్యం కారణంగా ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు. ఆయన స్థానంలో సంస్థ షారుక్ ఖాన్ ను ప్రారంభోత్సవానికి ఆహ్వానించింది. ఈ సంధర్భంగా వీరంతా కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Similar News