వాటినేందుకు నమ్ముతారు నన్ను నమ్మండి అంటున్నాడు!

Update: 2017-08-15 01:44 GMT

బాబీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ' చిత్రాన్ని కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని ముందుగా గత ఏడాది 'జనతా గ్యారేజ్' వచ్చిన డేట్ కే విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కొత్తగా సెప్టెంబర్ 21 న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే సినిమా అయితే సెప్టెంబర్ 21 న అంటున్నారు గాని సినిమా అప్పటిలోగా పూర్తికాదనే గాసిప్స్ బయలుదేరాయి. ఎందుకంటే ఎన్టీఆర్ బిగ్ బాస్ షోతో బిజీగా ఉంటున్నాడు... అలాగే సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడం వలన అనుకున్న డేట్ కి సినిమా రాకపోవచ్చనే ఊహాగానాలు బయలుదేరాయి.

ఈ గాసిప్స్ కి ఊతమిచ్చేలా ఎన్టీఆర్ జై లవ కుశ సెప్టెంబర్ 21 నుండి తప్పుకుంటే శర్వానంద్ తమ మహానుభావుడిని అదే రోజు బరిలోకి దింపుతాడనే ప్రచారము జోరుగా జరిగింది. ఈ ప్రచారానికి ఎన్టీఆర్ ఫాన్స్ కొంచెం టెన్షన్ కూడా పడ్డారు. కానీ ఎన్టీఆర్ సినిమా అనుకున్న టైం కే సిద్దమవుతుంది. అదే షెడ్యూల్ ప్రకారమే సినిమా షూటింగ్ కూడా జరుగుతుందట. కానీ ఇలాంటి రూమర్స్ ని ఎవరు క్రియేట్ చేస్తున్నారో తెలియదు గాని ఆ రూమర్స్ కి జై లవ కుశ నిర్మాత షాక్ అవడమే కాదు మా సినిమా అనుకున్న డేట్ కే వస్తుందని చెబుతున్నాడు.

జై లవ కుశ గురించి బయట ప్రచారమవుతున్న రూమర్స్ లో నిజంలేదని... సినిమా సెప్టెంబర్ 21 కి వస్తుందని.....అలాగే లవ క్యారక్టర్ కు సంబంధించిన టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తోంది కూడా మరి కొన్ని రోజుల్లో చెబుతాం అని ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆఫీసియల్ ప్రకటన చేసింది. ఇక నిర్మాతే ఈ సినిమా డేట్ మారదని క్లారిటీ ఇచ్చాక ఇంకెన్ని గాసిప్స్ వచ్చినా ఈ సినిమాని ఇంకేం చెయ్యలేవు.

Similar News