టాలీవుడ్ ని డ్రగ్స్ కేసు ఒక కుదుపు కుదిపేస్తోంది. డ్రగ్స్ వాడకమే కాకుండా డ్రగ్స్ మాఫియాతో లింక్స్ పెట్టుకుని వారితో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న చాలామందికి ఇప్పుడు సిట్ అధికారులు చుక్కలు చూపెడుతున్నారు. ఇండస్ట్రీలోని ప్రముఖులకు నోటీసులు ఇచ్చి వారిని తమ ముందు హాజరవమనడం దగ్గరనుండి వారిని విచారించే పద్దతి వరకు మొత్తం ఒక సినిమానే తలపిస్తుంది. ఇకపోతే సిట్ ముందు హాజరయిన వారిలో పూరి అండ్ బ్యాచ్ ఇంకా ఇతర సెలబ్రిటీస్ ఉన్నారు. టాలీవుడ్ లో మొదటి నుండి పూరి బ్యాచ్ నే ఎవరో టార్గెట్ చేశారని.. కొంతమంది ప్రముఖులకు నోటీసులు ఇవ్వకుండా సిట్ అధికారులు గోప్యత పాటిస్తున్నారని అనుమానాలున్నాయి అంటూ ప్రచారం కూడా జరుగుతుంది.
అయితే ఏ విధమైన ఇష్యు జరిగిన, లేకుంటే చిన్న పెద్ద ఏ విషయమైనా తన స్పందనను ట్విట్టర్ లో పెట్టె రామ్ గోపాల్ వర్మ, డ్రగ్స్ టాలీవుడ్ లో ఇన్ని రోజులనుండి కలకలకం రేపుతున్నప్పటికీ సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత తన శిష్యుడు పూరి జగన్నాధ్ కోసం స్పందించాడా.. అన్నట్లు ట్వీట్ల వర్షం కురిపించాడు. అసలు ఎక్సయిజ్ అధికారులు ముందుగా సినిమా ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేసారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వర్మ....అకున్ సబర్వాల్ కేవలం టాలీవుడ్ మీదే ఫోకస్ పెట్టాడంటూ మొదలు పెట్టాడు. అకున్ సబర్వాల్ తో రాజమౌళి బాహుబలి 3 తీస్తే బావుంటుందంటూ సబర్వాల్ పై సెటర్స్ స్టార్ట్ చేసాడు.
మరి సినిమా సెలబ్రిటీస్ పూరి, సుబ్బరాజులను ప్రశ్నించినట్టే బడా నాయకుల స్కూల్ పిల్లల్ని కూడా విచారిస్తారా? అసలు ఎక్సైజ్ శాఖ ఎప్పటినుండో ఉంది. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో సెలబ్రిటీస్ డ్రగ్స్ వాడుతున్నారని మీడియా కి లీకులిచ్చి ఎక్సైజ్ శాఖ హైలెట్ అయ్యింది. టాలీవుడ్ పరిశ్రమను లక్ష్యంగా చేసుకుని సిట్ పబ్లిసిటీ చేసుకుంటుందని కామెంట్స్ చేసాడు. మరి వర్మ వేసిన ట్వీట్స్ కి ఎక్సైజ్ శాఖ చంద్రవదన్ అదిరిపోయే కౌంటర్ వేసాడు. తాము సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చెయ్యలేదని.... అయినా తాము- నోటీసులు ఇచ్చిన సెలబ్రిటీస్ అంతా తమ విచారణకు చక్కగా సహకరిస్తున్నారని... వర్మ పేరును డైరెక్ట్ గా చెప్పకుండా చంద్రవదన్.... ఇలాంటివి మాట్లాడి ఎక్సైజ్ శాఖ అధికారుల మనోధార్యాన్ని దెబ్బతీయకండి అంటూ ఘాటుగా స్పందించాడు.