వర్మ రచ్చ... తేజ డీసెంట్!!

Update: 2017-10-14 15:00 GMT

బాలకృష్ణ నిర్మాణ సారధ్యంలో దర్శకుడు తేజ ఎన్టీఆర్ బయో పిక్ ని తెరకెక్కించే ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు. ఇప్పటికే దర్శకుడు తేజ ఎన్టీఆర్ బయో పిక్ ని తెరకెక్కిస్తున్నట్లుగా ప్రకటన కూడా చేసాడు. అయితే ఎన్టీఆర్ బయో పిక్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా వున్నానని వచ్చే నెల అంటే నవంబర్ లో కార్తీక మాసం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభిస్తామని చెప్పడమే కాదు.... వచ్చే ఏడాది సమ్మర్‌లో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28వ తేదీన చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని కూడా చెబుతున్నాడు.

అలాగే ఎన్టీఆర్ బయో పిక్ లో నటించే నటీనటులకు సంబందించిన పనులు కూడా స్టార్ట్ అయ్యాయని.... ఈ చిత్రంలో క్యారెక్టర్లకు తగ్గట్టుగా నటీనటుల్ని ఎంపిక చేయడం కోసం ఒక ఏజెన్సీని కూడా సంప్రదించామని చెబుతున్నాడు తేజ. ఇక ఎన్టీఆర్ బయో పిక్ తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్నట్లుగా.... . తెలుగువారికి ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఆయన కొడుకు నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. అలాగే తన తండ్రి పాత్రను బాలకృష్ణే పోషిస్తున్నాడని ప్రముఖ బాలీవుడ్ . సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్ లో తెలియజేశాడు.

మరి రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా గురించి చేసే హడావిడికన్నా తేజ - బాలకృష్ణ కలయికలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయో పిక్ మాత్రం సైలెంట్ గానే పనులు చకచకా జరిగిపోతున్నాయి. మరి గురువు వర్మ ఎన్టీఆర్ జీవితంపై రచ్చ చేస్తుంటే...... శిష్యుడు తేజ మాత్రం ఎంతో డీసెంట్ గా ఎన్టీఆర్ జీవితాన్ని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు.

Similar News