ఏదొక కాంట్రవర్సీ చేయకుండా ఉండలేడేమో రామ్ గోపాల్ వర్మ. తాజాగా రాజమౌళి చేసిన పోస్ట్ పై కూడా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు వర్మ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌళి కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు రాజమౌళి.
అయితే ఆ ఫోటోను వర్మ తన ఫేస్బుక్ లో షేర్ చేస్తూ.. స్త్రీని ఆరాధించేవాడిగా ఉంటూ నేనొక్కటే చెప్పదలుచుకున్నా.. నిస్సిగ్గుగా చేస్తున్న ఈ... గే కల్చర్ ప్రచారాన్ని ఖండిస్తున్నా..... అంటూ తొలుత ఓ పోస్ట్ పెట్టాడు. మరోసారి అదే ఫొటోను షేర్ చేసి... ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురూ ఆ టైపేనా.. పైగా ముగ్గురూ కూడా పెళ్లయిన వాళ్లు. అల్లా ఏం జరుగుతోంది? జీసస్ దయచేసి మీరైనా నాకు చెప్పండి.. బాలాజీ గారు మీరైనా చెప్పండి.... అంటూ నీఛమైన వ్యాఖ్యలు చేశాడు.
దీంతో అటు ఎన్టీఆర్ ఫాన్స్,ఇటు చెర్రీ ఫాన్స్ వర్మ పై విరుచుకుపడుతున్నారు. అయితే ఒక అభిమాని..‘నేను బాలాజీని చెబుతున్నాను.. ఈ భూమ్మీద నీకు టైమ్ దగ్గర పడింది ఆర్జీవీ. నువ్వు చనిపోబోతున్నావు’ అంటూ ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. అంతేకాకుండా బాలీవుడ్ లో డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, రాంగోపాల్ వర్మ పరస్పరం ముద్దాడుకుంటున్న ఫొటోను పోస్ట్ చేసి ‘గే కల్చర్ అది కాదు.. ఇది అంటూ విమర్శ చేసాడు. చెర్రీ -ఎన్టీఆర్ ముల్టీస్టార్ర్ర్ వస్తుందని ఆనందంలో వున్నా ఇరువురి అభిమానాలు వర్మ చేసిన కామెంట్స్ కు కోపంతో ఊగిపోతున్నారు