వర్మ ని విమర్శించాల్సిన అవసరం లేదంటున్న రాజు గారు

Update: 2018-01-21 07:41 GMT

సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ప్రతి చర్యకి విమర్శకుల నుంచి పదునైన ప్రతి-చర్యని ఊహించి అవి తిప్పికొట్టటానికి తనని తాను నిత్యం సిద్ధంగా ఉంచుకుంటాడు. ఇక తాజాగా వర్మ తన మేధా శక్తీ మొత్తాన్ని వాడి జి.ఎస్.టి అర్ధాన్ని మారుస్తూ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అని కొత్త నిర్వచనం తెలిపాడు. ఇప్పుడు వర్మ జి.ఎస్.టి టాప్ ట్రేండింగ్ లో ఉండటం తో ప్రతి సెలబ్రిటీ కి దీనిపై స్పందించమని ప్రశ్న ఎదురవుతూనే వుంది. చాలా మంది ప్రముఖులు ఈ విషయమై స్పందించటానికి నిరాకరిస్తుండగా సీనియర్ ఇండస్ట్రీ పర్సన్, రెబెల్ స్టార్ కృష్ణం రాజు మాత్రం ఈ ప్రశ్న ని దాటవేయకుండా తన అభిప్రాయం తెలిపారు.

"రామ్ గోపాల్ వర్మ ఏ ప్రయత్నం చేసినా అందులో తన శ్రమతో పాటు పరిశీలనా విచక్షణ కచ్చితంగా కనిపిస్తుంది. అలానే ఈ సారి కూడా జి.ఎస్.టి తో ఆయన చెప్పదలచినది ఏమిటి అనే కోణంలో ఆలోచించిన వారెవరికీ రామ్ గోపాల్ వర్మ పై విమర్శ చేయాలనిపించదు అనేది నా అభిప్రాయం. ఇంకా ఆయన చూపదలచుకున్న పూర్తి నిడివి చిత్రం చూడలేదు కాబట్టి ఇప్పటి నుంచే ఏది కరెక్ట్ ఏది కాదు అనేది చర్చకు అనవసరం. పైగా ఇప్పటి జనానికి అంతర్జాలం చాలా సులువుగా అందుబాటులో ఉంటున్న సాధనం. అందులో ఏది చూడాలో ఏది చూడకూడదో ఎవరు ఎవరికీ చెప్పాల్సిన పని లేదు కదా. పైగా వర్మ తన జి.ఎస్.టి వీడియో అందరూ తప్పకుండా చుడండి అని బలవంతం కూడా చేయడంలేదు. కాబట్టి ఆయన పై విమర్శ అనవసరం." అంటూ బదులిచ్చారు రెబల్ స్టార్ కృష్ణం రాజు.

Similar News