వర్మ కోసం కొత్త హీరోయిన్

Update: 2017-11-12 14:00 GMT

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో వర్మ పేరు మార్మోగిపోతోంది. అయితే ఇక్కడ మనం చెప్పుకునేది ఆ వర్మ గురించి కాదండి... కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్..... తన కొడుకు ధృవ్ ని హీరోగా పరిచయం చేస్తున్నది. అది కూడా.... తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి రీమేక్ కు తమిళ్ లో వర్మ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు. బాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ వర్మ సినిమాలోని హీరోయిన్ పై తాజాగా సస్పెన్స్ వీడింది. మొన్నటివరకు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అమ్మాయిపై చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఎవర్నీ సెలక్ట్ చేయలేదు మేకర్స్. అయితే ఇప్పుడు ఓ కొత్తమ్మాయి కోసం కాస్టింగ్ కాల్ కు పిలుపునిచ్చారు.

అర్జున్ రెడ్డి తెలుగు వెర్షన్ లో కొత్తమ్మాయి షాలిని పాండే నటించింది. ఇక ఇప్పుడు అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ లో కొత్త హీరోయిన్ ను తీసుకోబోతున్నారు. ఈ సినిమాలో ధృవ్ కొత్త హీరోగా పరిచయమవుతున్నాడు కాబట్టి.... హీరోయిన్ ను కూడా కొత్త ముఖం అయితే బాగుటుందని విక్రమ్ భావించాడు. స్వయంగా విక్రమే.. కాస్టింగ్ కాల్ కు పిలుపునిచ్చాడు.

అయితే విక్రమ్ అందమైన అమ్మాయితో వీడియో షూట్ చేసి పోస్ట్ చేశాడు. ఇలాంటి క్వాలిటీస్ మీలో ఉంటే... మీ ఫొటోలు పంపించండంటూ మెయిల్ ఐడీ ఇచ్చాడు. త్వరలోనే వర్మ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోతుంది.

Similar News