లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ పేరు చెబితేనే టిడిపి నేతలకు భయంపట్టుకుంటుంది. రామ్ గోపాల్ వర్మ తియ్యబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబుని ఎలాంటి విలన్ గా చూపిస్తాడో... ఇంకా కొంతమంది టిడిపి నేతలను ఎంతగా విలన్స్ ని చేస్తాడో అని విపరీతమైన టెన్షన్ లో ఉన్నారు వారు. అలాగే లక్ష్మీస్ ఎన్టీఆర్ ని కచ్చితంగా తీస్తానని వర్మ కూడా టిడిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. సినిమా అనౌన్సమెంట్ నుండే రచ్చ మొదలుపెట్టిన వర్మ సినిమాలో ఎలాంటి నటులను తీసుకుంటాడో... ఎవరిని ఎంపిక చేస్తాడో.. అనే ఆసక్తితో తెలుగు ప్రేక్షకులు ఉన్నారు.
అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ పాత్రకి ప్రకాష్ రాజ్ అని... లక్ష్మి పార్వతి పాత్రకి రోజా అని ప్రచారం జరుగుతుంది. అయితే ఎన్టీఆర్ పాత్రకి ప్రకాష్ రాజ్ ని తీసుకోవడంలేదని.. అలాగే లక్ష్మి పార్వతి పాత్రకి రోజని తీసుకోనని స్పష్టం చేసిన వర్మ.. ఆ రెండు పాత్రలకు కొత్త నటుల్ని తీసుకుంటున్నట్టుగా... ఇప్పటీకే ఎన్టీఆర్ పాత్రకి నటుడుని ఎంపిక చెయ్యడమే కాకుండా...... అతనికి ఎన్టీఆర్ లా హావభావాలు పలికించేందుకు శిక్షణ కూడా ఇప్పిస్తున్నట్టుగా వర్మ చెబుతున్నాడు. అలాగే లక్ష్మి పార్వతి పాత్రకి కూడా కొత్త నటిని తీసుకుంటున్నట్టుగా చెబుతున్నాడు.
అసలు పాత నటులెవరిని అడిగిన లక్ష్మీస్ ఎన్టీఆర్ కాంట్రవర్సీ సినిమాలో నటించేందుకు ఒప్పుకుని ఉండరు. అందుకే వర్మ ఇలా తెలియని నటులను ఎంపిక చేసుకుని పనికానిచ్చేస్తున్నాడంటూ వార్తలొస్తున్నాయి. ఇకపోతే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వైసిపి నేత రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నాడు.