విడుదల ఐన ప్రతి చోట హిట్ టాక్ తో దూసుకుపోతుంది వరుణ్ తేజ్ - రాశి ఖన్నా కాంబినేషన్ లో వచ్చిన 'తొలి ప్రేమ' సినిమా. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు యుఎస్ లో లో సైతం ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తుంది.
ప్రీమియర్స్ ద్వారా తక్కువ వసూల్ చేసినా..పాజిటివ్ టాక్ రావడంతో శుక్రు, శనివారాల్లో ఓ కుదుపు కుదిపేసింది. దింతో ఈ చిత్రం రెండు రోజుల్లో హాఫ్ మిలియన్ మార్క్ ను దాటేసింది.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ చిత్రం గురువారం ప్రీమియర్స్ ద్వారా $152,171 కలెక్ట్ చేసింది. తొలిరోజు ప్రీమియర్స్ తో కలుపుకుని $249 k నమోదు చేసింది. శనివారం వరకు ఏకంగా $504k డాలర్స్ కొల్లగొట్టింది. దింతో రెండు రోజుల్లోనే ఈ చిత్రం $504k నమోదు చేయగలిగింది. దింతో ముచ్చటగా మూడోసారి వరుణ్ తేజ్ హాఫ్ మిలియన్ మార్క్ ని అందుకున్నాడు. ఇదే దూకుడు కొనసాగితే 2 మిలియన్స్ క్లబ్ లో చేరే అవకాశంవుందని ట్రేడ్ వర్గాలు అంచనా.