వరుణ్ తేజ్ కు ఇప్పుడు మంచి టైం నడుస్తుంది. ఫిదా.. తొలిప్రేమ ఇలా వరస హిట్స్ తో మంచి జోష్ మీద వున్నాడు. అదే జోష్ తన నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్నాడు వరుణ్. 'ఘాజీ' వంటి డిఫరెంట్ టేస్ట్ ని మనకి అందించిన కొత్త డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో అంతరిక్షం నేపథ్యంలో వరుణ్ తేజ్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో వరుణ్ 'వ్యోమగామి'గా కనిపించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి జార్జియాలో భారీస్థాయిలో ఒక ప్రత్యేకమైన సెట్ వేసి అక్కడే షూట్ మొత్తం కంప్లీట్ చేయనున్నారు టీం. ఇందుకోసం టీం ఆల్రెడీ జార్జియా వెళ్లిపోయింది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లను ఎంపిక చేసుకున్నారట. వాళ్ల అధ్వర్యంలో .. సహాయ సహకారాలతో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.
పాత్రపరంగా వరుణ్ తేజ్ అవసరమైన శిక్షణ తీసుకోవడంలో బిజీగా వున్నాడు. సబ్ మెరైన్ సెట్ వేసి మనల్ని ఎలా ఆశ్చర్యపరిచారో అదే విధంగా ఈ అంతరిక్షం సెట్ కూడా వేస్తున్నారు.