దాదాపు ఒక్కేసారి సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యారు మెగా హీరోస్ సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్. స్టార్టింగ్ లో వీరి కెరీర్ అంతగా ఏమిలేదు. సాయి ధరమ్ తేజ్ 'రేయ్' సీనియాతో ఎంట్రీ ఇచ్చి దారుణమైన ప్లాప్ రుచి చూసాడు. అలానే వరుణ్ తేజ్ 'ముకుంద' సినిమా కూడా అంచనాల్ని అందుకోలేకపోయింది.
మొదటి ప్లాప్ తర్వాత తేజు ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.. ‘సుప్రీమ్’ లాంటి హిట్లతో మంచి రేంజికి చేరుకున్నాడు. కానీ వరుణ్ తేజ్ పరిస్థితి అంతగా బాగోలేదు. 'కంచె' సినిమా నటుడుగా మంచి పేరు తెచ్చిపెట్టిన కమర్షియల్ గా ఆ సినిమా అంతగా ఆడలేదు. 'మిస్టర్' కంటే ముందు తేజు సినిమా విన్నర్' ప్లాప్ అయినప్పటికీ ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి.
అప్పుడు తేజు మార్కెట్ పెరిగిపోయి స్టార్ హీరో స్థాయిలో కనిపించింది. కానీ ఏడాది తిరిగే సరికి పరిస్థితి తల్లకిందులైంది. 'ఫిదా'తో బ్లాక్ బస్టర్ కొట్టిన వరుణ్ మార్కెట్ పెంచుకున్నాడు. అదే ప్రభావం 'తొలిప్రేమ' మీద పడింది. ఈ సినిమా తొలి రోజే 5 కోట్ల పైగా షేర్ కలెక్ట్ చేసింది. అదే రోజు తేజు సినిమా 'ఇంటెలిజెంట్' అందులో సగం కూడా కలెక్ట్ చేయలేకపోయింది. వరుణ్... తేజు ముందు చాలా వీక్ గా ఉన్నాడు...కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తల్లకిందులైపోయింది