ఇదివరకు టాలీవుడ్ లో లీడ్ రోల్స్ లో నటించిన చాలా మంది నటీమణులు ప్రస్తుతం స్పెషల్ క్యారెక్టర్స్ తో మెప్పిస్తొన్న సంగతి తెలిసిందే. వారి వయసుకు తగ్గట్టు లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. అయితే చాలా వరకు అలాంటి పాత్రలు క్లిక్ అవుతున్నాయి కూడా.
వయసుతో సంబంధం లేకుండా నటిస్తూ వెళ్లిపోతున్నారు. శ్రీదేవి - మాధురి దీక్షిత్ లాంటి నటీమణులు కూడా అమ్మ పాత్రలు, అక్క పాత్రలు చేసుకుంటున్నారు. అసలు విషయానికి వస్తే.. స్టార్ హీరోయిన్ గా కొనసాగిన భూమిక గత కొన్నేళ్ల నుండి లీడ్ రోల్స్ చెయ్యట్లేదు. లేటెస్ట్ గా వచ్చిన ఎంసీఏ సినిమాలో వదిన రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే.
అయితే 50 ఏళ్లు ఉన్నవాళ్లే లీడ్ రోల్స్.... సినిమాలను చేస్తున్నారు. కానీ 39 ఏళ్ల భూమిక ఇలా ఎందుకు చేస్తోంది అని అడిగితే..అసలు తాను వయసు బేధాన్ని ఏ మాత్రం లెక్కచేయను అంటోంది. కేవలం సినిమాలో నా పాత్ర నాకు నచ్చితే చాలు. ఎదో ఆఫర్ వచ్చిందని.... ఏది పడితే అది చేయను. నాకు కథ నచ్చాలి. అలానే నా పాత్ర కూడా నచ్చాలి అప్పుడే ఆ సినిమాను నేను ఒకే చేస్తా అంటుంది భూమిక.