వచ్చే నెలలో పవన్ సినిమా స్టార్ట్

Update: 2018-02-05 08:54 GMT

పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అయ్యిపోయారు. జనసేన పార్టీ తరపు ప్రచారం కూడా చేస్తున్నాడు. ఇంకా ఎలక్షన్స్ అయ్యేవరకు పవన్ సినిమాల్లో నటించడని వార్తలు వచ్చాయి. మొన్న సంక్రాంతికి రిలీజ్ అయిన ‘అజ్ఞాతవాసి’ సినిమా డిజాస్టర్ కావడంతో పవన్ పూర్తిగా వచ్చే ఎలక్షన్స్ మీదే ద్రుష్టి పెడతారని చాలానే వార్తలు వచ్చాయి. అయితే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఏంటంటే..

తాజా సమాచారం ప్రకారం.. పవన్ మళ్లీ సినిమాలతో బిజీ కానున్నాడు. ఎప్పుడో కాదు వచ్చే నెల నుండి అంట. ముందుగా కుదర్చుకున్న ఒప్పందం ప్రకారం పవన్ కల్యాణ్ ఒక సినిమాను చేయబోతున్నట్టుగా సమాచారం. దీనికి కథ కూడా రెడీ అయిపోయిందంట. మైత్రీ మూవీస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళ్ సినిమాను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించనున్నారని సమాచారం.

ఈ సినిమాను పవన్ త్వరగా కంప్లీట్ చేయాలనీ చూస్తున్నాడట. కానీ ఎంత త్వరగా చేద్దాం అనుకున్న కనీసం మూడు నెలలు పడుతుంది. మరోవైపు ఎన్నికలకు కూడా పెద్దగా సమయం కనిపించడం లేదు. మరి పవన్ సినిమా వైపు వెళ్తే జనసేన పరిస్థితి ఏమిటి? అనేది సందేహం. మరోపక్క ఈ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ పోటీ చేయట్లేదని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు చేసే ప్రచారం టీడీపీ తరూపేనని విశ్లేషణలు చెబుతున్నారు.

Similar News