ప్రస్తుతం 'జయ జానకి నాయక' చిత్రంతో బిజీగా వున్న టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి తాను చెయ్యబోయే సినిమాలు మొదలుపెట్టే ముందు కనీసం నాలుగైదు నెలల గ్యాప్ తీసుకుని .. ఆ సమయాన్ని స్క్రిప్టు పని కోసం వెచ్చిస్తాడట. అలాగే బోయపాటి తాను తీసే చిత్రాల షూటింగ్ కూడా నెమ్మదిగా చేస్తాడనే టాక్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటినుండో వినిపిస్తున్నది. అందుకే 12 ఏళ్లలో కేవలం బోయపాటి ఆరు సినిమాలనే డైరెక్ట్ చెయ్యగలిగాడని అంటున్నారు. ఏదైనా పర్ఫెక్ట్ గా ఉండాలనుకునే ఈ దర్శకుడు ఇప్పుడు తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు.
ఇక సాయి శ్రీనివాస్ చిత్రం 'జయ జానకి నాయక' కంప్లీట్ కాగానే బోయపాటి, చిరంజీవి 152 వ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడనే టాక్ వినబడుతుంది. కేవలం టాక్ మాత్రమే కాదు నిజంగానే చిరు బోయపాటికి ఫోన్ చేసి... నా నెక్స్ట్ సినిమా నీతోనే కథని రెడీ చెయ్యమని చెప్పినట్లు కూడా ప్రచారం జరిగింది. వచ్చే ఏడాది మొదట్లోనే బోయపాటి - చిరుల చిత్రం సెట్స్ మీదకెళుతుందని చెబుతున్నారు... కానీ చిరంజీవి 151 వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' మొదలు పెట్టి షూటింగ్ పూర్తయ్యేటప్పటికీ బాగా టైం పడుతుందని అంటున్నారు.
మరి ఎక్కువ టైం పడితే బోయపాటి చిరు కోసం అంతకాలం వెయిట్ చేస్తాడా లేకపోతె మారేదన్న ఆఫర్ ని ఒప్పుకుంటాడో అంటున్నారు. మరోపక్క బోయపాటిని అఖిల్ కోసం రంగంలోకి దింపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక దీనికి భారీ ఆఫర్ నాగార్జున, బోయపాటికి ఇచ్చాడని కూడా వార్తలొచ్చాయి. మరి బోయపాటి - అఖిల్ కాంబినేషన్లో సినిమా గనక సెట్స్ మీదకెళితే బోయపాటి మళ్ళీ ఒక ఏడాదిన్నర బిజీ అవుతాడు. మరి చిరు 'ఉయ్యాలవాడ' , బోయపాటి - అఖిల్ చిత్రాలు ఒకేసారి పూర్తయితే గనక బోయపాటి - చిరు కాంబినేషన్ మూవీ మాత్రం వచ్చే ఏడాది చివరిలో అయినా పట్టాలెక్కుతుందేమో చూద్దాం.