వచ్చే ఏడాది 4 సినిమాల్తో వస్తాడంట!

Update: 2017-12-04 06:50 GMT

'గురు' సినిమా తర్వాత వెంకీ సైన్ చేసిన ప్రాజెక్ట్ గాని వెంకీ నుండి సినిమాలు ఇప్పటివరకు విడుదల కానీ కాలేదు. ప్రస్తుతం దర్శకుడు తేజతో కమిట్ అయిన వెంకటేష్ వచ్చే ఏడాది అయితే నాలుగు సినిమాలు తన నుండి వస్తాయని అభిమానులకు చెబుతున్నాడు. ఈ ఏడాది లో వెంకటేష్ చాలా గ్యాప్ తీసుకుని తేజ తో సినిమా పట్టాలెక్కించబోతున్నాడు. ఆ సినిమా రేపో మాపో పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఇక ఆ సినిమా టైటిల్ కూడా 'ఆటా నాదే వేటా నాదే' అని ప్రచారంలో ఉంది. అయితే వెంకటేష్ గుంటూరు లో ఒక బట్టల షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడ వెంకీ ని మీడియా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ ఏడాది చివరికి వచ్చేసింది..వచ్చే ఏడాది నా నుండి నాలుగు సినిమాలు ఖచ్చితంగా వస్తాయని మాట ఇచ్చేసాడు.

మరి ప్రస్తుతం తేజ సినిమా ఒకటి చేస్తున్న వెంకటేష్, ఇంకో సినిమాని దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మల్టి స్టారర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరోపక్క వెంకీ సోగ్గాడే, రారండోయ్ ఫెమ్ కళ్యాణ్ కృష్ణ కి మరో సినిమాకి కమిట్ అయ్యాడనే న్యూస్ ఉంది. మరి వెంకటేష్ ఇలా నాలుగు సినిమాలను ఒకేసారి పట్టాలెక్కించేస్తాడా? లేదంటే ఒకదాని తర్వాత మరొకటి చేస్తాడో తెలియదు గాని అభిమానులకు మాత్రం 2018 లో తన నుండి నాలుగు సినిమాలుంటాయనే మాట మాత్రం ఇచ్చేసాడు.

చూద్దాం వెంకీ చెప్పినట్టుగా మనం వెంకటేష్ నుండి వచ్చే ఆ నాలుగు సినిమాలేమిటా అని వెయిట్ చేస్తో కూర్చో వల్సిందే.

Similar News