హీరో నాగార్జున కళ్యాణ్ కృష్ణ కి దర్శకుడిగా మంచి లైఫ్ ఇచ్చాడు. వరుసగా రెండు సినిమాలను అతని చేతిలో పెట్టాడు నాగ్. ఆ రెండు సినిమాలతోను తానేమిటో ప్రూవ్ చేసుకున్నాడు కళ్యాణ్ కృష్ణ. నాగార్జున హీరోగా సోగ్గాడే చిన్ని నాయన తో హిట్ కొట్టిన కళ్యాణ్ కృష్ణ, నాగ చైతన్య కి రారండోయ్ వేడుక చూద్దాం వంటి ఫ్యామిలీ హిట్టిచ్చాడు. అయితే కళ్యాణ్ కృష్ణ మూడో సినిమా కూడా అక్కినేని వారితోనే ఉంటుంది అనుకుంటున్న సమయంలో కళ్యాణ్ కృష్ణ.. ఉన్నట్టుండి రవితేజతో సినిమాని లైన్ లో పెట్టాడు.
అయితే ఈ సినిమా ఎప్పుడో మొదలు కావాల్సి ఉండగా... కొన్ని కారణాల వలన సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. అయితే ఆ కారణాలు నాగార్జునే అనే గాసిప్స్ వినబడ్డాయి. నాగార్జున మూడో సినిమా ని కూడా అక్కినేని కాంపౌండ్ లో చేసిన తర్వాతే ఇతర హీరోకి కమిట్ అవ్వమని రవితేజతో కళ్యాణ్ కృష్ణ ని సినిమా చేయనివ్వకుండా అడ్డం పడ్డానే వార్తలొచ్చాయి. మరోపక్క నిర్మాత సురేష్ బాబు కూడా కళ్యాణ్ కృష్ణ ని మూడో సినిమా వేరే హీరోతో చేయకుండా అడ్డం పడుతున్నాడనే గుసగుసలు కూడా వినబడ్డాయి.
కానీ ఇప్పుడు లైన్ క్లియర్ అయ్యి కళ్యాణ్ కృష్ణ తన మూడో ప్రాజెక్ట్ ని రవితేజ తో మొదలెట్టబోతున్నడని అంటూన్నారు. అయితే మూడో సినిమా ఎవరితో చేసినా... నాలుగో సినిమాని మాత్రం అక్కినేని వారికే చెయ్యాలని నాగార్జున, కళ్యాణ్ కృష్ణ తో మాట తీసుకున్నాడట. అలాగే నాగ్ కి నాలుగో సినిమా విషయంలో అగ్రిమెంట్ కూడా చేసాడని వినికిడి. అయితే నాగార్జున, కళ్యాణ్ కృష్ణకి అడ్డం పడడానికి కారణం... కళ్యాణ్ కృష్ణ, సురేష్ బాబు దగ్గరకి వెళ్లి వెంకీ - నాగ చైతన్య హీరోగా ఒక కథ ని వినిపించాడట. అయితే ఆ సినిమాలో చైతు ఉంటాడని నాగ్ కి కళ్యాణ్ కృష్ణ చెప్పకపోవడంతోనే నాగ్ కి మండి కళ్యాణ్ కృష్ణ మరో హీరోతో చెయ్యకుండా అడ్డు పడ్డాడని అంటున్నారు. కానీ ఇప్పుడు నాగ్ తో సెటిల్ చేసుకుని రవితేజతో కళ్యాణ్ కృష్ణ "నేల టికెట్" అనే టైటిల్ తో సినిమా మొదలెట్టబోతున్నాడట.